ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss 10: Who got eliminated this week?

BB10: ఈ వారం ఎలిమినేట్ అయ్యింది ఎవరంటే

Bigg Boss 10: Who got eliminated this week?Bigg Boss 10: Who got eliminated this week?


బిగ్ బాస్ సీజన్ 10 లో వారానికొక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యి హౌస్ ని వీడడం కామన్. కానీ గత వారం సీక్రెట్ రూమ్ అంటూ ఆడియన్స్  ఓటింగ్ తో ఎలిమినేట్ అయిన షాలిని ని దాచి పెట్టారు. అందుకే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి.

హౌస్ లో దేబ్జానీ, నరేష్, రాంప్రసాద్, ముఖేష్ తప్ప మిగతావాళ్లంతా ఈ వారం నామినేషన్స్ లోకి వున్నారు. అందులో అమన్, నీతూ మాస్టర్, త్రిగుణ లు ఇమ్యూనిటీ పొంది సేవ్ అయ్యారు. మిగిలిన వారిలో ఈ వారం ఎలిమినేట్ అవ్వబొయె కంటెస్టెంట్ ఎవరు అనే విషయంలో ఆసక్తి మొదలైంది.

వైల్డ్ కార్డు ల్లో వైల్డ్ ఫైర్ అంటూ హౌస్ లోకి వచ్చిన శ్వేతా నాయుడు, శివ్, దక్షి లు ఈ వారం డేంజర్ జోన్ లో కనిపించారు. కానీ శివ్ తన ఆటతో ఆడియన్స్ ఆలోచనలో మార్పు తీసుకొచ్చాడు. రోహిత్, త్రిగుణ లు ఓటింగ్ లో పోటీపడ్డారు. కానీ డేంజర్ లో ఉన్న వారిలో ఈ వారం దక్షి ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తుంది. అయితే దక్షి తో పాటుగా మరో ఎలిమినేషన్ కూడా ఈ వారం జరగొచ్చని తెలుస్తుంది.

Bigg Boss Telugu 10: Dakshi Reportedly Eliminated