ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Saif Ali Khan Jokes He Still Hasn't Received His KBC Ghee Prize Or Cheque

నెయ్యి లేదు.. చెక్కు కూడా అందలేదు!

Saif Ali Khan Jokes He Still Hasn't Received His KBC Ghee Prize Or ChequeSaif Ali Khan Jokes He Still Hasn't Received His KBC Ghee Prize Or Cheque

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇటీవల ప్రముఖ టీవీ గేమ్ షో `కోన్ బనేగా కరోడ్‌పతి` లో పాల్గొని ప్రశంసలు అందుకున్నారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేసిన ఈ కార్యక్రమంలో `హైవాన్` చిత్ర ప్రమోషన్స్ కోసం అక్షయ్ కుమార్‌తో కలిసి సైఫ్ విచ్చేశారు. ఈ ఆటలో సైఫ్ ప్రదర్శించిన ఉత్సాహం, ప్రత్యేకించి బహుమతిగా ప్రకటించిన నెయ్యిపై చూపించిన ఆసక్తి సోషల్ మీడియాలో  వైరల్ అయింది. దాంతో నెటిజన్లు సైప్ ను సరదాగా నెయ్యి లెజెండ్ అని పిలవడం ప్రారంభించారు.

తాజాగా `ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో`లో భార్య కరీనా కపూర్ ఖాన్‌తో కలిసి పాల్గొన్న సైఫ్ అలీ ఖాన్ ఈ విషయంపై అందరినీ నవ్వించారు. కేబీసీలో తాను గెలుచుకున్న రెండు సంవత్సరాల ఉచిత గోవర్ధన్ నెయ్యి సప్లై ఇప్పటివరకు తన ఇంటికి చేరుకోలేదని సైఫ్ తమాషాగా చెప్పారు. అ షోలో గెలుచుకున్న ప్రైజ్ మనీ చెక్ కూడా తనకు ఇంకా అందలేదని సరదాగా వాపోవడంతో కపిల్ శర్మ, కరీనా, అర్చనా పూరన్ సింగ్‌తో పాటు ప్రేక్షకులంతా ఒక్కసారిగా నవ్వుల్లో మునిగిపోయారు.

ఇటీవలే సైఫ్ అలీ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై కపిల్ శర్మ స్పందిస్తూ `కేబీసీలో రెండేళ్ల నెయ్యి గెలుచుకున్న ఆనందంలోనే సైఫ్ సోషల్ మీడియాలోకి వచ్చారు` అంటూ ఒక అభిమాని చేసిన కామెంట్‌ను చదివి వినిపించారు. దీనికి కరీనా కూడా తలాడిస్తూ సైఫ్‌ను ఆటపట్టించింది.
 

Saif Ali Khan says his two-year supply of ghee and Kaun Banega Crorepati cheque