రామాయణానికి పోటీగా స్పిరిట్ బరిలో!
Spirit vs Ramayana Part 2 Diwali 2027 Box Office Clashరెబల్ స్టార్ ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా కాంబబినేషన్ లో తెరకెక్కుతోన్న భారీ యాక్షన్ డ్రామా `స్పిరిట్` విడుదల తేదీలో కీలక మార్పు చోటుచేసుకుంది. మార్చి 2027 విడుదల కాస్త వెనక్కి వెళ్ళి కొత్త తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని 2027 దివాళీ కానుకగా అక్టోబర్ 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు సందీప్ రెడ్డి వంగా వెల్లడించారు.
ఈ విడుదల తేదీ ప్రకటనకు ముందు సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియా వేదికగా అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తించారు. ప్రభాస్ కొత్త పోస్టర్తో పాటు సరికొత్త విడుదల తేదీని ప్రకటిస్తున్నట్లు తెలుపుతూ `ది మ్యాన్ బిహైండ్ ది షేడ్స్` అంటూ అభిమానులను ఉత్తేజపరిచారు. ఆ తర్వాత కొన్ని నిమిషాలకే అక్టోబర్ 29, 2027న 'స్పిరిట్' గ్రాండ్ రిలీజ్ కానుందని అధికారికంగా స్పష్టం చేశారు. దీంతో సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానుల సందడి ఒక్కసారిగా పెరిగింది.
`స్పిరిట్` అక్టోబర్ 29న రానుండటంతో 2027 దివాళీ బాక్సాఫీస్ వద్ద బిగ్ క్లాష్ ఏర్పడనుంది. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పౌరాణిక చిత్రం `రామాయణ పార్ట్ 2` కూడా సరిగ్గా అదే దివాళీ సమయానికి (నవంబర్ 5) విడుదలకు సిద్ధమవుతోంది. సందీప్ గత చిత్రం `యానిమల్` హీరో రణ్బీర్ కపూర్ చిత్రంతోనే ఇప్పుడు సందీప్-ప్రభాస్ల `స్పిరిట్` ఢీకొట్టడం విశేషం.
















































