BB10: త్రిగుణ్ పై నోరు పారేసుకున్న రోహిత్
Bigg Boss Telugu 10: Trigun vs Rohit
బిగ్ బాస్ సీజన్ 10 లో ఈ వారం మొత్తం వైల్డ్ ఫైర్స్ అలాగే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్స్ నడుమ మాటల యుద్ధమే కాదు, టాస్క్ ల్లో పోటీ జరిగింది, కెప్టెన్సీ టాస్క్ విషయంలో ఒరిజినల్ గ్యాంగ్ స్టర్స్ లో వారిలో వారే కొట్టుకుంటున్నారు. గత రాత్రి ఎపిసోడ్ లో రోహిత్, షాలిని కెప్టెన్ అవ్వకుండా బ్లూ టీం లో ఉండి గ్రీన్ టీమ్ అమన్ కు హెల్ప్ చేయడంపై రోహిత్ ఫైర్ అయ్యాడు.
అదే మూడ్ ని కంటిన్యూ చేస్తున్న రోహిత్ మరోసారి త్రిగుణ్ పై నోరు పారేసుకున్నాడు. వాష్ రూమ్స్ దగ్గర సోఫాలో రోహిత్ బట్టలు తీసి కిందపడేసిన త్రిగుణ్ ని రోహిత్ నానా మాటలు కాదు కాదు.. నోర్ముయ్, బుద్ధిలేదా, మనిషి ఎదిగావ్ బుర్ర ఎదగలేదు, వెధవ అంటూ పోట్లాట పెట్టుకున్నాడు.
త్రిగుణ్ కూడా కెప్టెన్ రాంప్రసాద్ దగ్గర మట్లాడుతూ రోహిత్ ని రెచ్చగొడుతూ కనిపించడంతో రోహిత్ ఇంకా ఇంకా నోరు పారేసుకున్న ప్రోమో ను స్టార్ మా రివీల్ చేసింది. రోహిత్ ని ఝాన్సీ, షాలిని ఆపినా ఆగకుండా గొడవపడ్డారు.
















































