BB10: రోహిత్ లో చేంజ్-తట్టుకోలేకపోతున్న షాలిని
Bigg Boss Telugu 10: Shalini and Rohit Breakup
బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు లు వచ్చి షాలిని, రోహిత్ బాండింగ్ గురించి చెప్పినప్పుడు ఎంతో లైట్ గా తీసుకుని, షాలిని కి ధైర్యం చెప్పిన రోహిత్ లో చేంజ్ మొదలయిందా, షాలిని ని రోహిత్ పక్కనపెడుతున్నాడా, అదే షాలిని చెబుతుంది. ముఖేష్, సుధీర్ దగ్గర షాలిని తన బాధను చెప్పుకుంటుంది. రోహిత్ లో చేంజ్ వచ్చేసింది, నన్ను అవాయిడ్ చేస్తున్నాడు, నాకు చాలా హర్టింగ్ గా ఉంది అని చెబుతుంది.
నీతూ మాస్టర్ అందరితో బానే ఉంటారు, కానీ నాతోనే అలా. రోహిత్ నీతూ మాస్టర్ ని అక్కగా ఫీల్ అవుతున్నాడు. తన దగ్గర ఫ్యామిలీ వైబ్స్ కనిపిస్తున్నాయి. నీతూ మాస్టర్ రోహిత్ తో పెట్టుకునే బాండింగ్ జెన్యూన్ గా ఆర్గానిక్ గా అనిపించడం లేదు. రోహిత్ ని తమ్ముడు అని పిలవొచ్చా అని అడుగుతుంది, సిస్టర్ బాండింగ్ పెట్టుకుంటుంది.
రోహిత్ స్ట్రాంగ్ నెస్ చూసి అతనితో అక్క బాండింగ్ పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది అంటూ ముఖేష్, సుధీర్ తో చెబుతుంది. అందరూ జోక్స్ తో ఎంజాయ్ చేస్తున్నా షాలిని ఒక్కటే మష్రూమ్ రూమ్ లో కూర్చుని ఫీల్ అవుతుంది. మొత్తానికి షాలిని రోహిత్ లో వచ్చిన చేంజ్ ని తట్టుకోలేక పోతుంది అనేది స్పష్టంగా అర్ధం అవుతుంది.















































