జైలర్ 2 దర్శకుడిపై మోహన్ లాల్ కాస్ట్యూమ్ డిజైనర్ ఫైర్
Mohanlal's costume designer slams Jailer 2 cuts
జైలర్ 2 విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ 2 కి విడుదలైన ప్రతి లాంగ్వేజ్ లోను బ్లాక్ బస్టర్ వైబ్స్ కనిపించాయి. ఎలాంటి బజ్ లేకుండా తెలుగులో విడుదలైన జైలర్ 2 కి ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. క్రిటిక్స్ కూడా జైలర్2 కి బెస్ట్ రేటింగ్స్ ఇచ్చారు.
ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ స్టార్ క్యామియోస్ అంటూ అందరూ ముఖ్త ఖంఠం తో చెబుతున్న మాట. శివరాజ్ కుమార్, మోహన్ లాల్, జైలర్ 1 లో ఉన్న వారే కాకుండా జైలర్2 కి మరికొంతమంది గెస్ట్ అప్పీరియన్స్ హైలెట్ అయ్యాయి. అయితే జైలర్ పార్ట్ 1, పార్ట్ 2లో హైలెట్ అయిన మోహన్ లాల్ పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్ జిషాద్ షంసుద్దీన్ జైలర్ 2 డైరెక్టర్ నెల్సన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోట్ రిలీజ్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
జైలర్ 2 షూటింగ్ సమయంలో మోహన్ లాల్ పై తీసిన సీన్స్ సినిమాలో ఖచ్చితంగా హిట్ అవుతాయని తనకు ఎంతో నమ్మకం ఉంది, అంతేకాదు ట్రైలర్ లో చూపించిన 2 సెకన్స్ సన్నివేశాన్ని కూడా సినిమా లో చూపించలేదు, మోహన్‌లాల్ సార్ మూడు విభిన్న లుక్స్‌కు సంబంధించిన సన్నివేశాలనూ జైలర్ 2 నుంచి ఎడిటింగ్ లో పూర్తిగా తీసేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.
సూపర్‌స్టార్ స్థాయి నటుడికి సంబంధించిన సీన్స్ ని ఇలా ఎడిటింగ్ లో తీసెయ్యడం బాధగా ఉంది, ఒకవేళ జైలర్ 2కు సీక్వెల్ వస్తే అందులో తాను చెయ్యను, తనకు వ్యక్తిగత ప్రయోజనాలు, లాభాలు, అభిమాన సంఘాల రాజకీయాలు లేదా స్టార్డమ్ ముఖ్యం కాదని.. అభిమానులు, సినిమా కళ, ముఖ్యంగా మోహన్‌లాల్ సార్ ముఖ్యమని ఆయన ఆ నోట్ లో ఓపెన్ గా ప్రకటించారు.















































