డ్రాగన్ సెట్ లోకి ఎంటర్ అయిన టైగర్ !

NTR Back to the Sets of DragonNTR Back to the Sets of Dragon


డ్రాగన్ చిత్ర సెట్ లో భుజానికి తగిలి గాయంతో రెండు మూడు నెలలుగా రెస్ట్ తీసుకుంటున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ డ్రాగన్ షూట్ లోకి ఎంటర్ అయ్యారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న పవర్ ఫుల్ పాన్ ఇండియా ఫిలిం డ్రాగన్. వచ్చే ఏడాది జూన్ లో విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్ర సెట్ లో ఎన్టీఆర్ గాయపడ్డారు.

ఆ గాయంతో భుజానికి సర్జరీ చేయించుకుని గత రెండు నెలలుగా రెస్ట్ లో ఉన్నారు. ఇపుడు గాయం తగ్గుముఖం పట్టడంతో ఎన్టీఆర్ డ్రాగన్ సెట్ లోకి ఈరోజు గురువారమే ఎంటర్ అయ్యారు. అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేయడానికి ఎన్టీఆర్ రెడీ అయ్యారు. ఎన్టీఆర్ గాయం కారణంగా ఈ చిత్రం మరోసారి వాయిదా పడొచ్చనే వార్త అభిమానుల్లో ఆందోళన కలుగజేసింది.

కానీ అనుకున్న సమయానికే డ్రాగన్ షూటింగ్ పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేస్తామని నిర్మాతలు చెబుతున్నారు. ఇక ఎన్టీఆర్ రావడంతో షూటింగ్ ఊపందుకుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ మెయిన్ విలన్ గా నటించబోతున్నారు, అలియా భట్ గెస్ట్ రోల్ లో కనిపించబోతుంది, రుక్మిణి వసంత్ హీరోయిన్. 

NTR Joins Dragon Shoot