ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Kamal Haasan responded to Elon Musk's Starlink licence remark

ఎలాన్ మస్క్ కి సెలబ్రిటీస్ కౌంటర్

Kamal Haasan responded to Elon Musk's Starlink licence remarkKamal Haasan responded to Elon Musk's Starlink licence remark

 

టెస్లా, X అధినేత ఎలాన్ మస్క్ చేసిన చీప్ వ్యాఖ్యలపై సెలబ్రిటీస్ ఫైర్ అవుతున్నారు. ఇండియాలో స్టార్‌లింక్ సేవలకు లైసెన్సింగ్ ప్రక్రియలో జాప్యం జరగడం పై X అధినేత ఎలాన్ మస్క్ సోషల్ మీడియా వేదికగా ఇండియాని, ప్రధాని మోడీ ని చులకన చేస్తూ..  భారత ప్రధాని అంబానీనా? అంటూ సెటైరిక్ గా ట్వీట్ చేయడంపై ఇండియన్స్ మాత్రమే కాదు, సినీ సెలబ్రిటీస్ సైతం తప్పుబడుతున్నారు.

కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్ ఎలాన్ మాస్క్ కి కౌంటర్ గా వేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. ఏ బిలియనీర్ అయినా, అది ఇండియా అయినా, US అయినా... దేశ విధానాలను నిర్దేశించలేరు. ఏ దేశం అయినా తన సొంత ప్రయోజనాల ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటుంది అని అన్నారు.

కమల్ పోస్ట్ ని రీ పోస్ట్ చేస్తూ బాలీవుడ్ నటి కంగనా స్పందించారు. ఇది మస్క్‌కు బాగా తగిలి ఉంటుంది. ఏ బిలియనీర్ దేశ విధానాలను నిర్దేశించకూడదు. కమల్ హాసన్ చాలా స్పష్టంగా, వ్యంగ్యంగా, స్ట్రయిట్ గా చెప్పారు అంటూ ఎలాన్ మాస్క్ ని ఉద్దేశించి కంగనా ట్వీట్ చేసారు.

 

Kamal Haasan and Kangana Hits Back at Elon Musk