పిల్లల విషయంలో నటి సంచలన నిర్ణయం!
Varalaxmi Sarathkumar Opens Up About Choosing A Childవిలక్షణ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ వ్యాపారవేత్త నికోలాయ్ సచ్‌దేవ్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా వరలక్ష్మి వ్యక్తిగత జీవితం, భవిష్యత్తు ప్రణాళికలపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలోనూ తీవ్రంగా చర్చనీయాంశమవుతున్నాయి. పిల్లల విషయంలో తనకున్న స్పష్టమైన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా వెల్లడించింది. పెళ్లి కాగానే పిల్లలను కనడం అనేది ఒక విధిగా చూడాల్సిన అవసరం లేదని, అది పూర్తిగా దంపతుల వ్యక్తిగత ప్రాధాన్యతలకు సంబంధించిన విషయమని పేర్కొన్నారు. తామిద్దరం కలిసి సంతోషంగా జీవితాన్ని గడపాలని భావిస్తున్నామని.. ఈ విషయంలో ఇద్దరి మధ్య ఎలాంటి సందేహాలు లేవని తేల్చి చెప్పారు.
నికోలాయ్ సచ్‌దేవ్‌కు తొలి వివాహం ఒక కుమార్తె ఉన్న సంగతి తెలిసిందే. ఆ పాపతో తనకు మంచి అనుబంధం ఉందని.. ఆమెను తన సొంత కూతురిలాగే చూసుకుంటానని వరలక్ష్మి తెలిపారు. భర్త నికోలాయ్ కూడా తన నిర్ణయాన్ని సంపూర్ణంగా గౌరవిస్తారని.. తమ ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని వెల్లడించారు. భాగస్వామి మద్దతు ఉన్నప్పుడు బయటి ప్రపంచం నుంచి వచ్చే ఎలాంటి ఒత్తిళ్లకు లొంగాల్సిన అవసరం ఉండదని వరలక్ష్మి అభిప్రాయపడ్డారు.
సమాజంలో మహిళలపై పెళ్లి .. పిల్లల విషయంలో ఉండే సాంప్రదాయ ఒత్తిళ్లపై వరలక్ష్మి ఈ సందర్భంగా మాట్లాడారు. పెళ్లి తర్వాత పిల్లలను కనడమేది మహిళ జీవితానికి సంపూర్ణత్వం ఇస్తుందనే ఆలోచన సరైనది కాదని సూచించారు. ప్రతీ మహిళకు తమ జీవితాన్ని, శరీరాన్ని, భవిష్యత్తును తమకు నచ్చినట్లుగా మలుచుకునే స్వేచ్ఛ , హక్కు ఉన్నాయని..ఇతరుల కోసం కాకుండా తమ సొంత సంతోషం కోసం జీవించాలని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.
















































