ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss 10: 4 contestants in Danger zone

BB10: ఈ వారం డేంజర్ లో ఎవరంటే..!

Bigg Boss 10: 4 contestants in Danger zoneBigg Boss 10: 4 contestants in Danger zone


బిగ్ బాస్ సీజన్ 10 లో ఐదోవారం లో ఇమ్యూనిటీ, కెప్టెన్సీలో ఉన్న వారు మినహాయించి అంటే వర్షిణి, వంశీ, సుధీర్ తప్ప మిగతా హౌస్ మేట్స్ అంతా నామినేషన్స్ లోకి వచ్చేసారు. గత వారం వీకెండ్ ఎపిసోడ్ లో రోహిత్ ని హోస్ట్ నాగార్జున గెట్ అవుట్ అంటూ డోర్స్ ఓపెన్ చెయ్యడం, త్రిగున్, అమన్ లకు ఎల్లో కార్డ్ ఇవ్వడం వంటి విషయాలలోనే కాదు, అపూర్వ, ముఖేష్ గౌడ్ ల మద్యన నామినేషన్స్ రచ్చ మాములుగా జరగలేదు.

అయితే ఈవారం నామినేషన్స్ లోకి వచ్చిన వారిలో రోహిత్ గ్రాఫ్ పడిపోతుంది, అంతలా రోహిత్ హౌస్ లో దిగజారి మాట్లాడుతున్నాడు అనుకున్నవాళ్లకు అతను ఓటింగ్ తో షాకిస్తున్నాడు. ఈ వారం నామినేషన్స్ లో ఉన్న త్రిగున్, ముఖేష్, దేబ్జానీ, రామ్ ప్రసాద్, నరేష్, షాలిని, అపూర్వ, ఝాన్సీ, చరణ్, అమన్ ల కన్నా ఆదిత్యధిక ఓటింగ్ తో నెంబర్ 1 పొజిషన్ లో రోహిత్ ఉంటె.. ఆతర్వాత స్థానంలో త్రిగున్ కనిపిస్తున్నాడు.

ఇక మూడు ప్లేస్ లో ముఖేష్  గౌడ్ ఉంటె, నాలుగో స్థానంలో రామ్ ప్రసాద్, ఆతర్వాత ఐదో ప్లేస్ లో అమన్ ఉన్నారు. ఆతర్వాత ఆరు, ఏడు స్థానాల్లో అపూర్వ, నరేష్ ఉంటె... ఈ వారం డేంజర్ జోన్ లో షాలిని, చరణ్, దేబ్జానీ, ఝాన్సీలు కనిపిస్తున్నారు. అందరికన్నా తక్కువగా ఝాన్సీకి ఓట్లు పడుతున్నాయి.

అయితే ఝాన్సీ ఈ వారం టాస్క్ లో బాగా ఆడింది. త్రిగున్, అమన్ కు ఇమ్యూనిటీ వచ్చేసింది. ఇక ఓటింగ్ లో రోహిత్ టాప్ లో ఉండడానికి కారణం అతని పిఆర్ టీమ్ అనే చర్చ నడుస్తుంది. రోహిత్ పిఆర్ టీమ్ వల్లే అతనికి అంతలా ఓట్లు పడుతున్నాయనే అభిప్రాయాలూ చాలామంది వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో అనేది. 

Bigg Boss 10