BB10: ఆట చెడగొట్టుకుంటున్న రోహిత్, షాలిని
Bigg Boss Telugu: Shalini Effect Derails Rohith's Game
బిగ్ బాస్ సీజన్ 10 లో అగ్నిపరీక్ష 2 నుంచి ఎంటర్ అయిన రోహిత్, షాలిని, స్రిష్టి, అమన్, ఝాన్సీ లలో రోహిత్, షాలిని మద్యన ఫ్రెండ్ షిప్ కి మించిన బాండింగ్ ఏర్పడింది. అందులోను అపూర్వ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చాక షాలిని రోహిత్ ని వదలడం లేదు. నైట్ అంతా కూర్చుని మాట్లాడుకుంటారు, అందరూ ఉన్నా గుసగుసలాడుకుంటారు.
షాలిని, రోహిత్ లవ్ ట్రాక్ నడిపిస్తున్నారో తెలియదు, ఫ్రెండ్ షిప్ నే అంత ఘాటుగా చేస్తున్నారో తెలియదు. ఒకరి చుట్టూ ఒకరు తిరుగుతూనే ఉంటారు. ఇక షాలిని అయితే రోహిత్ కోసం అపూర్వ తో గొడవపడుతూనే ఉంటుంది. ఎలా అంటే సవతుల పోరులా కనిపిస్తుంది. ఇక వారిద్దరూ బాండింగ్ వలన నైట్ నిద్ర లేకుండా మాట్లాడుకోవడం, తిండి తినకపోవడం వల్ల స్ట్రెంత్ తగ్గిపోతుంది.
అందుకే వాళ్లు ఆటల్లో సరిగా ఇన్వాల్వ్ అవ్వలేకపోతున్నారు. టాప్ 5 లో ఉండాల్సిన రోహిత్, షాలిని తమ ఆటను తామే పాడు చేసుకుంటున్నారు, ఒకరి చుట్టూ ఒకరు తిరగడం వలనే గేమ్ స్పాయిల్ అవుతుంది. ముఖేష్, వర్షిణి ఎంతగా క్లోజ్ గా ఉన్నా వారు ఆటను పక్కనపెట్టలేదు, వాళ్ళు గేమ్ లోనే ఉంటున్నారు. కానీ రోహిత్, షాలిని మాత్రం ఆట పై ఫోకస్ పెట్టకుండా లవ్ ట్రాక్ లో గడిపేస్తున్నారనే విమర్శలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.
















































