జనం కోసం జర్నలిజం నినాదంతో మరో కొత్త అడుగు

Telugu Prabha RelaunchTelugu Prabha Relaunch

జనం కోసం జర్నలిజం చేస్తూ.. ఏ పత్రిక జెండాను మోయకుండా తెలుగు రాష్ట్రాల్లో వార్తా స్రవంతిని అందిస్తున్న తెలుగుప్రభ పత్రిక అక్టోబర్ 15వ తేదీన రీలాంచ్ కు సిద్ధమైంది.  జర్నలిస్టులతో ప్రారంభమై, జర్నలిస్టులే విజయవంతంగా నడుపుతున్న ఏకైక పత్రికగా తెలుగుప్రభ తన ప్రత్యేకతను చాటుకుంటోంది.  అక్టోబర్ 15న జరిగే ఈ రీలాంచ్ ఈవెంట్ కూడా పార్టీలకు అతీతంగా కేవలం జర్నలిస్టులే ఆహ్వానితులుగా జరగనుండటం హైలైట్.  

లెజెండరీ పత్రికా సంపాదకులు, వివిధ జర్నలిస్ట్ సంఘాల నేతలు, వివాదాలకు అతీతంగా కలం కులంలో దిగ్గజ జర్నలిస్టులుగా పేరుగాంచిన వారంతా హాజరవుతున్న రీలాంచ్ వేడుకలపైనే ఇప్పుడు జర్నలిస్టులందరి కళ్లున్నాయి..  ప్రముఖ పత్రికా సంపాదకులు రామచంద్ర మూర్తి వంటి హేమాహేమీలు అతిథులుగా హాజరవుతున్న తెలుగుప్రభ రీలాంచ్ వేడుకలో సంచలన ప్రకటనలు ఉంటాయని భారీఎత్తున మీడియా మిత్రులు అంచనా వేస్తున్నారు.

అతి తక్కువ సమయంలో విశ్వసనీయతను సంపాదించుకుని అటు పత్రికా లోకంలో  ఇటు పాఠక లోకంలో తనదైన సొంత ముద్ర సంపాదించుకున్న తెలుగుప్రభ ప్రముఖ జర్నలిస్ట్, పర్యావరణ ఉద్యమకారుడు సమయమంత్రి చంద్రశేఖర శర్మ ఆధ్వర్యంలో విజయదుందిభి మోగిస్తోంది.

తెలుగు న్యూస్ పేపర్లో అరుదుగా జరిగే రీలాంచ్ సాహసానికి తెలుగుప్రభ సంస్థ సిద్ధమవ్వటం జర్నలిస్ట్ సర్కిల్ లో సెన్సేషనల్ పాయింట్ గా మారింది.  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేపర్ సర్కులేషన్ లో ఉంటూ దూసుకుపోతుండటం విశేషం.  పైగా జర్నిలిస్టులే నడుపుతున్న లాభాపేక్ష లేని పత్రికగా, ఏ పార్టీకి కొమ్ముకాయని ఏకైక పత్రికగా తెలుగుప్రభ జనం ఆదరణ పొందుతోంది.

గత కొన్నేళ్లుగా జర్నలిస్టులు ఈ పత్రికపై నిత్యం చర్చిస్తుండటం ఆసక్తిగా మారింది.  జనం కోసం జర్నలిజం అనే ట్యాగ్ లైన్ ను తూ.చ. తప్పకుండా పాటిస్తున్న సంస్థగా ఈ పత్రికకు పేరుండటం హైలైట్.
 

Telugu Prabha