లండన్ లో విజయ్-త్రిష చక్కర్లు
Vijay makes quick exit after briefly seen with Trisha
విజయ్ కి ఆయన భార్య సంగీత విడాకులు ఇవ్వడం లేదు, విడాకుల కేసు వాపస్ తీసుకుంది. సో విజయ్-సంగీత కలిసిపోయారు, మరి విజయ్ గర్ల్ ఫ్రెండ్ త్రిష పరిస్థితి ఏమిటో అని అందరూ త్రిష పై జాలి పడ్డారు. విజయ్ సంగీత తో విడాకుల తర్వాత త్రిష ను వివాహం చేసుకుంటారనే వార్త మాములుగా వైరల్ అవ్వలేదు.
సీఎం అయ్యాక కూడా త్రిష, విజయ్ పబ్లిక్ గా కలిసి కనిపిస్తున్నారు. సంగీత డివోర్స్ కేసు వాపస్ తర్వాత విజయ్, త్రిష దూరమవుతారనుకుంటే ఆగస్టు 15 ఫ్లాగ్ హోస్టింగ్ కి త్రిష విజయ్ అధికారిక కార్యక్రమంలో గెస్ట్ గా పాల్గొంది. ఇప్పుడు లండన్ లో కార్ రేసింగ్ కి సీఎం విజయ్, త్రిష కలిసి వెళ్లడం మరోసారి చర్చనీయాంశం అయ్యింది.
లండన్ లో సిల్వర్‌స్టోన్ రేసింగ్‌లో అజిత్ కుమార్ కార్ రేసింగ్‌లో పాల్గొంటున్నారు. ఆ రేస్‌కు గెస్ట్ గా వెళ్లిన సీఎం విజయ్ తో పాటుగా త్రిష కూడా వెళ్ళింది. ఆ రేస్ లో గ్రీన్ ఫ్లాగ్ ఊపి అజిత్ పాల్గొన్న కార్ రేస్‌ను విజయ్ ప్రారంభించదమే కాదు.. ఆ రేసింగ్ ని ఇంట్రెస్టింగ్ గా చూస్తున్న సమయంలో త్రిష కూడా అక్కడికి రావడంతో విజయ్ కాస్త వెనక్కి తగ్గిన వీడియో ఇప్పడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
అది చూసి విజయ్-త్రిష కలసి లండన్ లో చక్కర్లు కొడుతున్నారుగా అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.
















































