ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Mamitha Baiju reportedly hikes her fee

హిట్స్ జోరులో పారితోషికం పెంచిన హీరోయిన్

Mamitha Baiju reportedly hikes her fee Mamitha Baiju reportedly hikes her fee


ప్రేమలు బ్యూటీ మమితా బైజు వరస హిట్స్ తో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. సింపుల్ గా స్టార్ హీరోల సినిమాల్లో నటించేసి ఇప్పుడు  మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లోకి చేరిపోయింది. ఈ ఏడాది ఒకే ఒక్క నెలలో రెండు అద్భుతమైన హిట్లు ఖాతాలో వేసుకుంది. రెండు నెలల్లో మూడు సినిమాలు విడుదల చేసింది.

జులై 23 న జన నాయగన్ రిజల్ట్ అమ్మడు ని నిరాశ పరిచినా విశ్వనాథ్ అండ్ సన్స్, అలాగే మలయాళంలో నివిన్ పౌలి తో చేసిన బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ తో మమితా బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టింది. చాలా సింపుల్ గా విశ్వనాథ్ అండ్ సన్స్ తో రూ.240 కోట్లు, బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ తో రూ.100 కోట్ల హిట్టు ని ఖాతాలో వేసుకుంది.

ప్రేమలు చిత్రానికి లక్షల్లో పారితోషికం తీసుకున్న మామితా బైజు ఇప్పుడు మూడు కోట్లు అడుగుతుంది. రూ. 1.5 కోట్ల నుండి రూ. 3 కోట్ల వరకు డిమాండ్ చేస్తోందని ఫిలిం సర్కిల్స్ లో నడుస్తున్న చర్చ. మలయాళంలో లక్షల్లో ఉండే పారితోషికం తెలుగు, తమిళ్ కి వచ్చేసరికి కోటిన్నరకు చేరింది, ఇప్పుడది మూడు కోట్లకి వెళ్ళింది అంటున్నారు.

మరి అద్భుతమైన అందం, అలాగే యూత్ ని అట్రాక్ట్ చేసే గ్లామర్ తక్కువే ఉన్నా మామితా బైజు పెరఫార్మెన్స్ కి ఆమెకి క్రేజీ ప్రాజెక్ట్స్ లో అవకాశాలు తలుపు తడుతున్నాయి. 
 

Mamitha Baiju reportedly hikes her fee to Rs 3 crore