టాలీవుడ్ సీనియర్స్ మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్
Tollywood: Seniors or Seniors
టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ నడుమ ఎప్పుడు రసవత్తర పోరు నడుస్తుంది. చిరు, బాలయ్య పోటీ పడితే ఆ మజానే వేరు ఇక నాగ్ vs బాలయ్య అంటే ఆడియన్స్ లో మాములు ఇంట్రెస్ట్ కనిపించదు. ఇప్పుడు టాలీవుడ్ సీనియర్స్ మధ్యన ఆ ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగబోతున్నట్టే కనిపిస్తుంది.
ఇప్పటికే 2027 సంక్రాంతికి మెగాస్టార్ చిరు కాకతో, వెంకటేష్-కళ్యాణ్ రామ్ ల జనవరి 12 విడుదల తో పోటీపడుతున్నారు. సంక్రాంతి బాక్సాఫీసు బరిలో ఈ రెండు చిత్రానికి పోటీపడుతున్నాయి. ఇక క్రిస్మస్ కి కింగ్ నాగార్జున #King 100 మూవీని డిసెంబర్ 24 న విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేసేసారు.
అదే క్రిస్మస్ బరిపై నందమూరి నటసింహ కన్ను ఉంది. NBK111 ని బాలయ్య డిసెంబర్ 24 నే విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. అదే డేట్ లాక్ చేసి టైటిల్ తో సహా అనౌన్స్ చెయ్యడానికి మేకర్స్ సన్నద్ధం అవుతున్నారు. మరి ఆ తేదీనే NBK111 మేకర్స్ కన్ ఫర్మ్ చేస్తే క్రిస్మస్ కి బాలయ్య vs నాగ్ అయితే సంక్రాంతికి చిరు vs వెంకీ అన్నమాట, ఇది ఇంట్రెస్టింగ్ ఫైట్ కాక మరేమవుతుంది.







































