ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Samantha shares pics from her pregnancy era

ట్రెండింగ్ లో ఉండాలంటే అలా చెయ్యాల్సిందే

Samantha shares pics from her pregnancy eraSamantha shares pics from her pregnancy era


సినిమా చెయ్యకపోయినా.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులకు కనెక్ట్ అయ్యేలా ఫోటో షూట్స్, ఫ్యాన్స్ తో చిట్ చాట్ ఇలా ఏదో విధంగా హడావిడి చేస్తుంటేనే ట్రెండింగ్ లో ఉంటారు సెలబ్రిటీస్. సినిమాలు లేవు, షూటింగ్స్ లేవు అని సైలెంట్ గా ఇంట్లో కూర్చుంటే పది రోజులకే ప్రేక్షకులు. అభిమానులు మర్చిపోయి షాకిస్తారు.

అందుకే చాలామంది హీరోయిన్స్ ఉనికిని చాటుకునేందుకు సోషల్ మీడియాని నమ్ముకుని కష్టపడుతూ ఉంటారు. కానీ సమంత, చైతూతో విడాకుల తర్వాత అనారోగ్య కారణాలతో నటనకు బిగ్ బ్రేకిచ్చినా తన క్రేజు ఎక్కడా తగ్గకుండా చూసుకుంది. సోషల్ మీడియాలో ఫోటో షూట్స్, సింపతీ పోస్ట్ లతో నిత్యం ట్రెండింగ్ లోనే ఉంది.

ఇప్పుడు కూడా రెండో పెళ్లి, ప్రెగ్నెన్సీ అంటూ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫొటోస్ షేర్ చేస్తుంది. ప్రస్తుతం నటనకు బ్రేకిచ్చింది. కానీ నిత్యం అభిమానుల మధ్యలోనే ఉంటుంది. తాజాగా సమంత సెల్ఫీ లను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అటు అమ్మతనాన్ని ఆస్వాదిస్తూ.. ఇటు అభిమానులు తనని మర్చిపోకుండా చేస్తుంది.

అందుకే సమంత సినిమాలు చెయ్యకపోయినా, నటనకు దూరంగా ఉన్నా అంత క్రేజ్ ని సొంతం చేసుకుంది.

Samantha