వైజాగ్ AAA సినిమాస్ ఓపెన్ చేసిన
AAA Cinemas is all set for its grand opening
ఆగష్టు 9 ఆదివారం వైజాగ్ లోని ఇనార్బిట్ మాల్ లో AAA సినిమాస్ ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రారంభించారు. ఇప్పటికే హైదరాబాద్ అమీర్ పేటలో AAA సినిమాస్ తో పాటు గా కోకాపేట లో అల్లు సినిమా మల్టిప్లెక్స్ లు ఓపెన్ చేసిన అల్లు అర్జున్ ఇప్పుడు వైజాగ్ సిటిలోను AAA సినిమాస్ ను ప్రారంభించారు.
అల్లు అర్జున్ & ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో ప్రారంభమైన AAA సినిమాస్ నేటి నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఈరోజు సాయంత్రం 6:30 PM నుంచి సినిమా షోలు ప్రారంభం అవుతున్నాయి. మొత్తం 8 స్క్రీన్స్ తో అత్యాధునిక థియేటర్ అనుభూతిని అందించనుంది.
ఇక స్క్రీన్ 1లో 40 ప్రీమియం రిక్లైనర్ సీట్స్ ప్రత్యేక ఆకర్షణ నిలివబోతున్నాయి. స్క్రీన్ 5 & 7 పెద్ద స్క్రీన్స్‌తో, ఒక్కో థియేటర్లో 200 సీట్స్ సామర్థ్యంతో ప్రత్యేకంగా రూపొందించారు. వైజాగ్‌లో సినిమా ఎక్స్‌పీరియన్స్‌కి AAA సినిమాస్ కొత్త అడ్రస్ కానుంది.







































