మౌత్ టాక్ తోనే కొట్టాలి

DC Public TalkDC Public Talk


కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం పక్కన పెట్టి హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఈ శుక్రవారం లోకేష్ కనగరాజ్ డెబ్యూ మూవీ డీసీ చిత్రం విడుదలైంది. ఈ చిత్రం విడుదలకు ముందు ఎలాంటి బజ్ లేదు. సన్ పిక్చర్స్ నిర్మించడంతో ఆ జెమినీ టివిలో తప్ప ఈ డీసీ కి మరో ప్రమోషన్ లేదు.

కనీసం చెన్నై లోను ఈ డీసీ ని ఎక్కడా ప్రమోషన్ చెయ్యలేదు. లోకేష్ కనగరాజ్ కూడా డీసీ ని పెద్దగా ప్రమోట్ చెయ్యలేదు. అందుకే సినిమా విడుదలకు ముందు ఎలాంటి హైప్ లేదు. కానీ డీసీ విడుదలయ్యాక సాలిడ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి తమిళనాట, టాలీవుడ్ లోను హిట్ టాక్ వచ్చేసింది.

క్రిటిక్స్ మాత్రమే కాదు ఆడియన్స్ కూడా డీసీ కి పాజిటివ్ రెస్పాన్స్ చూపిస్తున్నారు. సినిమాకి అన్ని వైపుల నుంచి సూపర్ హిట్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. సోషల్ మీడియాలో లోకేష్ కనగరాజ్ డీసీ కి మౌత్ టాక్ బాగానే స్ప్రెడ్ అయ్యింది. మరి ఈ మౌత్ టాక్ తోనే డీసీ రికార్డ్ కలెక్షన్స్ నమోదు చెయ్యాలి.

చూద్దాం ఫైనల్ రన్ లో లోకేష్ కనగరాజ్ డీసీ ఎంత కలెక్షన్స్ తీసుకొస్తుంది అనేది. 

Lokesh Kanagaraj DC Social Media Talk