Advertisement

2027: అల్లు అర్జున్ డబుల్ ధమాకా

2027: Allu Arjun's Double Dhamaka


పుష్ప 2 సక్సెస్ తర్వాత అల్లు అర్జున్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తో రాకా చిత్రాన్ని చేస్తున్నారు. ఈ చిత్రం అనౌన్సమెంట్ దగ్గర నుంచే హాలీవుడ్ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. రాకా పోస్టర్ తర్వాత ఇప్పటివరకు అట్లీ ఈ సినిమాకి సంబందించిన ఎలాంటి అప్ డేట్ రాలేదు. ఆగస్ట్ లో రాకా నుంచి స్పెషల్ గ్లింప్స్ తో చాలా విషయాలకు క్లారిటీ వస్తుంది అనే టాక్ ఉంది.

ఇక రాకా చిత్రం వచ్చే ఏడాది అంటే 2027 లో విడుదల కాబోతుంది, రిలీజ్ డేట్ లాక్ చేసి రాకా స్పెషల్ గ్లింప్స్ తో చెప్పబోతున్నారని తెలుస్తుంది. అయితే అల్లు అర్జున్ 2027 లో ఒక్కటి కాదు రెండు చిత్రాలు విడుదలకు సిద్ధం చేస్తున్నారనే వార్త అల్లు ఫ్యాన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.

రాకా షూటింగ్ పూర్తి చేసి అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మరో చిత్రాన్ని స్టార్ట్ చేస్తారట. రాకా షూటింగ్ పూర్తయినా గ్రాఫిక్ వర్క్ కి చాలా సమయం కావాల్సి ఉందట. ఈలోపు అల్లు అర్జున్ లోకేష్ కనగరాజ్ మూవీ స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని ఫాస్ట్ గా పూర్తి చేసి 2027 డిసెంబర్‌లో థియేటర్లలో విడుదల చేయాలని నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నారు.

మరి అట్లీ తో రాకా, లోకేష్ కనగరాజ్ తో చేసే AA 23 రెండు చిత్రాలను అల్లు అర్జున్ 2027 లోనే ఆడియన్స్ ముందుకు తెచ్చే ప్లాన్ లో ఉన్నారట. అంటే అభిమానులకు ఒకే ఏడాది డబుల్ ధమాకా అన్నమాట. 

Allu Arjun's Two Releases in 2027