తండ్రి విజయ్ ని డైరెక్ట్ చెయ్యాలనుందట
Jason Sanjay Says He Wants To Direct Father Vijay
తమిళనాడు సీఎం విజయ్ తన భార్య సంగీతతో విడాకులు తీసుకోబోతున్నారు. కొన్నాళ్లుగా విజయ్ ఆయన భార్య సంగీత విడివిడిగా ఉంటున్నారు. పిల్లలు కూడా తల్లి సంగీతకే సపోర్ట్ చేస్తున్నారని, వారు తండ్రి విషయంలో కాస్త సీరియస్ గా ఉన్నారని, కొడుకు సంజయ్ అయితే తండ్రి పేరు కూడా వద్దనుకున్నాడనే ప్రచారం జరిగింది.
ఇక జాసన్ సంజయ్ హీరోగా కాకుండా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎంచుకుని దర్శకుడిగా సిగ్మా అనే చిత్రంతో ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ కాబోతున్నాడు. తాజాగా జాసన్ సంజయ్ మాట్లాడుతూ తనకి తన తండ్రి విజయ్ తో పాటుగా హాలీవుడ్ స్టార్ స్టాథమ్ ని డైరెక్ట్ చేయాలనుందని తన డ్రీమ్ ప్రాజెక్ట్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తనకి చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టమని, నాన్నతో పాటు నేను సినిమా సెట్స్ కి వెళ్లేవాడిని. ఆ వాతావరణం నాకు నచ్చేది. నేను మొదట పైలట్ కావాలనుకున్నా. ఆతర్వాత క్రికెటర్ అవ్వాలనిపించింది. కానీ ఇంటర్ కి వచ్చేటప్పుడు సినిమాలపై ఆసక్తి పెరిగింది. చిన్నప్పటి నుంచి నాకు కథలు చెప్పడం ఇష్టం.
అప్పటినుంచి ఆ కథలను రాసుకోవడం అలవాటైంది. కెనడాలో ఫిల్మ్ మేకింగ్ నేర్చుకున్నాక నేను ఏం చేయాలనుకుంటున్నానో ఓ క్లారిటీ వచ్చింది. దర్శకుడిగా మారాను. నేను మా నాన్న విజయ సినిమాకి డైరెక్ట్ చేయాలనుకున్నది కల.. అంటూ ఓ ఇంటర్వ్యూలో సంజయ్ చెప్పడం విజయ్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది.








































