Advertisement

ఈషా రెబ్బ : క్లాసీ అండ్ ట్రెడిషనల్

Eesha Rebba: Classy and Traditional

 

తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బ ఈ మధ్యన నార్త్ అమ్మాయిలా గ్లామర్ షో చేస్తుంది. సినిమాల్లో ఎక్కువగా ట్రెడిషనల్ గా కనిపించే ఈషా రెబ్బ సోషల్ మీడియాలో లుక్స్ లో చాలా చేంజ్ చూపిస్తుంది. అందాలు చూపిస్తూ అద్భుతమైన ఫొటోస్ తో యూత్ ని తన చుట్టూ తిప్పుకుంటుంది.

తాజాగా ఈషా రెబ్బ చాలా క్లాసీ గా ట్రెడిషనల్ లుక్ లో మతిపోగొట్టేసింది. గోల్డ్ కలర్ బ్రైడల్ లెహంగా లో హెవీ నెక్ లెస్, పెద్ద పెద్ద బుట్టలు వేసుకుని, నడుము కి సింపుల్ వడ్డాణం, చేతులకు సింపుల్ బ్యాంగిల్స్ వేసుకుని చక్కటి తెలుగమ్మాయి గా ఈషా రెబ్బ మనసులను దోచేసింది.

ఇకపోతే ఈషా రెబ్బ కొద్దిరోజులుగా దర్శకుడు కమ్ నటుడు తరుణ్ భాస్కర్ తో డేటింగ్ లో ఉంది అనే ప్రచారం ఉంది. ఈషా రెబ్బ-తరుణ్ భాస్కర్ లు వివాహం చేసుకుంటారని కూడా రూమర్స్ ఉన్నాయి. ఆ విషయమై ఇరువురు అసలు పెదవి విప్పడం లేదు.

Eesha Rebba Latest Look Goes Viral