వెకేషన్ లో అఖిల్ జంట
Akhil was spotted at the airport with his wife
లెనిన్ చిత్రం తో రూ.100 కోట్ల క్లబ్బులోకి ఎంటర్ అయిన అక్కినేని చిన్నోడు అఖిల్ రిలాక్స్ అవుతున్నాడు. నిన్నటివరకు విజయం కోసం అఖిల్ చాలానే ఒత్తిడి తీసుకున్నాడు. పదేళ్లుగా పలకరించని సక్సెస్ లెనిన్ రూపంలో అఖిల్ కి దొరికింది. మొదటిసారి రూ.100 కోట్ల క్లబ్బులోకి వెళ్లిన అఖిల్ ప్రస్తుతం వెకేషన్ మోడ్ లోకి వెళ్ళిపోయాడు.
భార్య జైనాబ్ తో కలిసి అఖిల్ ఈరోజు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించాడు. భార్య జైనాబ్ చేయిపట్టుకుని నడుస్తూ అఖిల్ ఆస్ట్రేలియా దేశానికీ పయనమయ్యాడు. అఖిల్ భార్య తో కలిసి ఆస్ట్రేలియా ట్రిప్ వేసినట్టుగా తెలుస్తుంది. అఖిల్ ని ఎయిర్ పోర్ట్ లో చూసిన అభిమానులు.. ఓ పది రోజులు అన్ని మరిచిపోయి ఎంజాయ్ చెయ్ అఖిల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
లెనిన్ సినిమలో అఖిల్ కష్టానికి అభిమానులే కాదు ఆడియన్స్ కూడా ఆహా ఓహో అన్నారు. లెనిన్ షూటింగ్, ప్రమోషన్స్ తో బాగా బిజీ షెడ్యూల్ గడిపిన అఖిల్ ఇప్పుడు లెనిన్ సక్సెస్ తర్వాత వెకేషన్ లో రిలాక్స్ అవ్వబోతున్నాడు.








































