మహేష్ ఎందుకు అంత లైట్ తీసుకున్నారు
Super Star Mahesh Babu
సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి హీరో వస్తున్నాడు అంటే మహేష్ బాబు అండ దండా ఉండాల్సిందే. సూపర్ స్టార్ కృష్ణ ఎలాగూ లేరు. ప్రస్తుతం స్టార్ డమ్ ని మైంటైన్ చేస్తున్న మహేష్ బాబే ఫ్యామిలీకి పెద్ద దిక్కు. కానీ తన అన్న, నటుడు రమేష్ కొడుకు జయకృష్ణ హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు అంటే మహేష్ పెద్దగా పట్టించుకోలేదు అనే మాట వినబడుతూనే ఉంది.
శ్రీనివాస మంగాపురంతో డెబ్యూ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన జయకృష్ణ కు బాబాయ్ మహేష్ అండ ఉందా అనే అనుమానం చాలామందిలో ఉంది. కేవలం ఓ వీడియో తో జయకృష్ణ గురించి చెప్పిన మహేష్ బాబు శ్రీనివాస మంగాపురం ప్రమోషన్స్ లో ఎక్కడా కనిపించలేదు.
తాతగారు ఎలాగూ లేరు, తండ్రి కూడా లేరు. అలాంటిది స్టార్ స్టేటస్ లో ఉన్న మహేషే కదా జయకృష్ణ ను పట్టించుకోవాల్సింది. కానీ మహేష్ జయకృష్ణ విషయంలో లైట్ గా ఉన్నారనే మాట నిపిస్తుంది. మహేష్ ఇంకాస్త అన్న కొడుకుకి హెల్ప్ చేసి ఉంటే బావుండేది అనే అభిప్రాయాలు వినబడుతున్నాయి.








































