అఖిల్ లెనిన్ ఓటీటీ డేట్ ఫిక్స్
Lenin OTT release: ZEE5 announces the streaming date
అక్కినేని అఖిల్ లేటెస్ట్ మూవీ లెనిన్. లెనిన్ చిత్రం రూ.100 కోట్ల క్లబ్బులోకి ఎంటర్ అయినట్టుగా మేకర్స్ రెండు రోజుల క్రితమే అఫీషియల్ పోస్టర్ తో ప్రకటించారు. ఆ పోస్టర్ చూడగానే రూ.100 కోట్లొచ్చాయి, ఇకపై ఓటీటీ డేట్ కూడా వస్తుందేమో, ఈమధ్యన అలానే జరుగుతుంది అని అనుకున్న వెంటనే లెనిన్ మేకర్స్ ఓటీటీ డేట్ లాక్ చేసి ప్రకటించారు.
లెనిన్ చిత్ర డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 స్యాంసి డీల్ తో సొంతం చేసుకుంది. థియేటర్స్ లో రూ.100 కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రాన్ని ఇప్పుడు జీ 5 స్ట్రీమింగ్ లోకి తెచ్చేందుకు రెడీ అవడమే కాకూండా.. అధికారికంగా ఆ డేట్ ని అనౌన్స్ చేసేసింది.
ఆగష్టు 7 నుంచి అంటే లెనిన్ థియేటర్స్ లో విడుదలైన నాలుగు వారాలకే ఓటీటీ స్ట్రీమింగ్ లోకి తేబోతున్నట్టుగా ప్రకటించారు. మరి ఈ రూ.100 కోట్ల మూవీని థియేటర్స్ లో మిస్ అయిన వారు ఓటీటీ లో వీక్షించేందుకు రెడీ అయిపోండి.








































