రూ.100 కోట్లొచ్చాయ్ - మరి ఓటీటీ ఎప్పుడు

Lenin Enters ₹100 Crore ClubLenin Enters ₹100 Crore Club

 

ఈమధ్యన రూ.100 కోట్ల పోస్టర్ వేసిన వారంలోనే సినిమాలు ఓటీటీ డేట్ లు లాక్ చెయ్యడమే కాదు అంతే స్పీడు గా స్ట్రీమింగ్ లోకి వచ్చేస్తున్నాయి. అది కూడా మూడు వారాల్లోనే. మరి ఇప్పుడు అక్కినేని కుర్ర హీరో అఖిల్ ఫస్ట్ టైమ్ రూ.100 కోట్ల క్లబ్బులోకి ఎంటర్ అయ్యాడు.

అఖిల్ లెనిన్ చిత్రం రూ.100 కోట్ల పోస్టర్ ను మేకర్స్ రీసెంట్ గానే విడుదల చెయ్యడంతో అది చూసి అక్కినేని ఫ్యాన్స్ సంబరపడిపోతుంటే.. మిగతా ఓటీటీ ఆడియెన్స్ మాత్రం లెనిన్ రూ.100 కోట్లు తెచ్చింది మరి ఓటీటీ రిలీజ్ ఎప్పుడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. లెనిన్ విడుదలై మూడు వారాలు పూర్తి చేసుకుని నాలుగో వారంలోకి ఎంటర్ అయ్యింది.

లెనిన్ ఓటీటీ హక్కులను జీ 5 ఫ్యాన్సీ డీల్ తో సొంతం చేసుకుంది. మరి జీ 5 నాలుగు వారాల గ్యాప్ లో లెనిన్ ని స్ట్రీమింగ్ లోకి తెస్తుందో లేదంటే రూ.100 కోట్లు వచ్చాయి, థియేటర్స్ లో ఆక్యుపెన్సీ లేదు అని మూడు వారాలకే ఓటీటీ డేట్ లాక్ చేస్తుందో అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. 

Akhil Akkineni's Lenin Enters ₹100 Crore Club