ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Priyanka Chopra, Nick Jonas and Mahesh Babu were spotted together

మందాకినీ జంట తో సూపర్ స్టార్

Priyanka Chopra, Nick Jonas and Mahesh Babu were spotted together


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. రామోజీ ఫిలిం సిటీ లో వేసిన స్పెషల్ సెట్ లో వారణాసి లోని కీలక సన్నివేశాలు రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ కోసం వారణాసి బ్యూటీ మందాకినీ అదేనండి ప్రియాంక చోప్రా హైదరాబాద్ లో దిగింది.

భర్త నిక్ జోనస్, కుమార్తె మాల్తీ తో కలిసి ప్రియాంక హైదరాబాద్ రాగా.. నిన్న బుధవారం సాయంత్రం ప్రియాంక చోప్రా ఆమె భర్త నిక్ జోనస్ లు హైదరాబాద్ లోని మహేష్ బాబు AMB మాల్ లో కనిపించారు. అక్కడ సూపర్ స్టార్ మహేష్ తో ప్రియాంక ఇంకా నిక్ జోనస్ లు దిగిన ఫొటో ఇప్పుడు వైరల్ అవుతుంది.

వారణాసి బ్యూటీ మందాకినితో సూపర్ స్టార్ అంటూ మహేష్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. మరి AMB సినిమా లో ఈముగ్గురు ఏం చేస్తున్నారో అంటూ సూపర్ స్టార్ అభిమానులు ఆరాలు మొదలు పెట్టారు.

Priyanka Chopra, Nick Jonas and Mahesh Babu