ఆ పోస్ట్ పై తమన్నా మాజీ ప్రియుడు క్లారిటీ!
Tamannah ex boyfriend Vijay Varmaసోషల్ మీడియాలో రిజర్వేషన్ - ఆర్థిక అసమానతల అంశాలపై తన పేరుతో విపరీతంగా చక్కర్లు కొడుతున్న ఒక పోస్ట్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ స్పష్టం చేశారు. ఆ పోస్ట్ తాను చేయలేదని.. అందులో ఉన్నదంతా పూర్తిగా అవాస్తవమని క్లారిటీ ఇచ్చారు. ఇటీవల దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థ, పరీక్షలు ..సమాన అవకాశాల గురించి చర్చలు సాగిన తరుణంలో ఇద్దరు స్నేహితుల ఆర్థిక నేపథ్యాలను ఉదాహరణగా చూపుతూ రిజర్వేషన్‌పై ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఆ పోస్ట్‌ను విజయ్ వర్మనే రాశారంటూ పలువురు నెటిజన్లు పెద్ద ఎత్తున షేర్ చేయడం చర్చనీయాంశమైంది. అయితే ఈ ప్రచారంపై విజయ్ వర్మ ఎక్స్ వేదికగా స్పష్టతనిచ్చారు. `నేను ఎప్పుడూ ఇలాంటి పోస్ట్ చేయలేదు. ఇదంతా పూర్తిగా అబద్ధం` అని వివరణ ఇచ్చి తన పేరుతో జరుగుతోన్న దుష్ప్రచారానికి పుల్‌స్టాప్ పెట్టారు.
సినిమా రంగానికే కాకుండా సామాజిక విషయాలపై ఎప్పుడూ స్పందించే నటుడిగా గుర్తింపు ఉన్న తనకి తాజా పోస్ట్‌తో మాత్రం ముడిపెట్టవద్దని తేల్చి చెప్పారు.
అలాగే విజయ్ వర్మ తన వృత్తిగత జీవితంలో వైవిధ్యమైన పాత్రలతో దూసుకుపోతున్నారు. నాగ్‌రాజ్ మంజులే దర్శకత్వంలో వచ్చిన `మట్కా కింగ్` వెబ్ సిరీస్‌లో గ్యాంబ్లింగ్ కింగ్‌పిన్ బ్రిజ్ భట్టి పాత్రలో నటించి ప్రేక్షకులను విశేషంగా అలరించిన సంగతి తెలిసిందే.








































