భర్త తో కలిసి HYDకి వారణాసి బ్యూటీ

Priyanka Chopra Lands In HyderabadPriyanka Chopra Lands In Hyderabad


వారణాసి బ్యూటీ ప్రియాంక చోప్రా వారణాసి కి సంబందించిన లేటెస్ట్ షెడ్యూల్ కోసం తన భర్త నిక్ జోనస్ అలాగే కూతురు తో కలిసి హైదరాబాద్ వచ్చింది. భారీ బడ్జెట్ తో ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా ఫిలిం వారణాసి లో సూపర్ స్టార్ మహేష్ బాబు కి జోడిగా మందాకినీ పాత్రలో ప్రియాంక చోప్రా నటిస్తుంది.

వారణాసి కోసం 14 నెలల పాటు షూటింగ్ చేశాను, ప్రతి సీన్ పర్ఫెక్ట్ గా వచ్చేవరకు దర్శకుడు రాజమౌళి నిద్రపోరు, ఈ చిత్రం మీ అందరికి తప్పకుండా నచ్చుతుంది అని ప్రియాంక చోప్రా ఓ ఇంటర్వ్యూలో వారణాసి పై హైప్ క్రియేట్ చేసే కామెంట్స్ చేసింది. ఇక రాజమౌళి మరో 80 రోజుల మాత్రమే వారణాసి షూటింగ్ బ్యాలెన్స్ అంటూ ఎప్పటికప్పుడు వారణాసి అప్ డేట్స్ అందిస్తున్నారు.

ఇక హైదరాబాద్ లో జరగబోయే కొత్త షెడ్యూల్ కోసం ప్రియాంక చోప్రా హైదరాబాద్ వచ్చారు. ఈ షెడ్యూల్ లో రాజమౌళి హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ని ప్లాన్ చేసారని.. ప్రియాంక చోప్రా, మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ లపై ఈ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తారని తెలుస్తుంది. 

Priyanka Chopra Lands In Hyderabad With Husband Nick Jonas And Daughter Malti Marie