ఫౌజీ: ప్రభాస్ రోల్ పై క్రేజీ న్యూస్
Prabhas To Play an Azad Hind Fauj Soldier in FauZi
హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ చిత్రం డిసెంబర్ 3 విడుదల అంటూ మేకర్స్ రీసెంట్ గానే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసారు. ఆ డేట్ తో వదిలిన పోస్టర్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. ఈ చిత్రంలో ప్రభాస్ సోల్జర్ గా కనిపిస్తారని అన్నారు. తాజాగా ఫౌజీ లో ప్రభాస్ రోల్ పై ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
ప్రభాస్ ఈ చిత్రంలో ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుడిగా కనిపించనున్నారని, నేతాజీ సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో భారత స్వాతంత్య్రం కోసం ఆయన చేసే పోరాటమే ఫౌజీ కి మెయిన్ ప్లాట్ అని తెలుస్తుంది. ప్రభాస్ ముందుగా బ్రిటీష్ ఇండియన్ ఆర్మీలో సైనికుడిగా పనిచేసి, ఆ తర్వాత సుభాష్ చంద్రబోస్ కోసం ఆజాద్ హింద్ ఫౌజ్ లో చేరుతారట.
ఫౌజీ లో ప్రభాస్ కేరెక్టర్ చూపించే ధైర్యసాహసాలు, త్యాగం, దేశభక్తి అన్ని హైలెట్ కానున్నాయని సమాచారం. మరి ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ.. ప్రస్తుతం ఫౌజీ కి సంబందించిన ఈవార్త నెట్టింట్లో సంచలనంగా మారింది.







































