ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Priyanka Chopra and her Rs 650 crore empire

జంషెడ్‌పూర్ నుండి గ్లోబల్ ఎంపైర్ వరకు

Priyanka Chopra and her Rs 650 crore empirePriyanka Chopra and her Rs 650 crore empire

 జంషెడ్‌పూర్‌లో  సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించి నేడు 650 కోట్ల రూపాయలకు పైగా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన తీరు ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. పీసీ విజయం  నటనకు మాత్రమే పరిమితం కాలేదు. ఒక  తెలివైన వ్యాపారవేత్తగా, గ్లోబల్ ఐకాన్‌గా  తనకంటూ  ప్రత్యేక గుర్తింపును సృష్టించుకున్నారు.

బాలీవుడ్‌లో తిరుగులేని స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న అనంత‌రం  సౌకర్యవంతమైన జీవితాన్ని వదిలి హాలీవుడ్ అడుగుపెట్టడం పీసీ  ధైర్యానికి నిదర్శనం. అమెరికన్ టీవీ సిరీస్ `క్వాంటికో` నుండి మొదలై గ్లోబల్ ప్రాజెక్టుల వరకు పీసీ ఎదుగుదల క్రమానుగతంగా సాగింది. నటిగా  ఉనికిని చాటుకోవడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో భారతీయ ప్రతిభను పరిచయం చేయడంలో  ముందు వరుసలో నిలిచారు. ఈ ప్రయాణం పీసీని కేవలం నటిగానే కాకుండా  గ్లోబల్ పవర్‌హౌస్‌గా మార్చింది.

ప్రియాంక చోప్రా నిర్మించుకున్న 650 కోట్ల సామ్రాజ్యం వెనుక కేవలం సినిమాలే లేవు. పీసీ   అద్భుతమైన బిజినెస్ వ్యూహకర్త కూడా. సొంతంగా ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించి విభిన్నమైన కంటెంట్‌ను నిర్మించడం ద్వారా తనకంటూ  ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. అలాగే ఫ్యాషన్ అండ్ బ్యూటీ బ్రాండ్లలో పెట్టుబడులు, అంతర్జాతీయ బ్రాండ్ అంబాసిడర్‌గా ఆమెకున్న క్రేజ్  అత్యంత సంపన్నమైన  మహిళా సెలబ్రిటీలలో ఒకరిగా నిలబెట్టాయి.

ప్రియాంక చోప్రా విజయానికి ప్రధాన కారణం నిరంతర కృషి ..అపారమైన ఆత్మవిశ్వాసం. ప్రతి అడుగులోనూ సవాళ్లను ఎదుర్కొంటూ వాటిని అవకాశాలుగా మలచుకోవడం  అలవాటు. హాలీవుడ్‌లో వేతనం పరంగా లేదా ప్రాధాన్యత పరంగా వివక్షను ఎదుర్కొన్నా? తన ప్రతిభతో దాన్ని అధిగమించి సమాన హక్కుల కోసం గళమెత్తారు.  స్వయంకృషితో ఎదిగిన పీసీ  ఇప్పుడు తదుపరి తరం నటీమణులకు  రోల్ మోడల్‌గా నిలుస్తున్నారు.

అలాగే సమాజానికి ఏదో ఒకటి తిరిగి ఇవ్వాలనే తపన కూడా పీసీ కనిపిస్తుంది. వివిధ సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. విద్య ,బాలికల హక్కుల కోసం ఆమె చేస్తున్న కృషి అభినందనీయం. జంషెడ్‌పూర్ నుండి మొదలైన ఈ ప్రయాణంలో పీసీ  ఎన్నడూ తన మూలాలను మర్చిపోలేదు. అంతర్జాతీయ వేదికలపై భారతీయతను గర్వంగా చాటడం పీసీ అల‌వాటుగా మార్చుకున్నారు.

Priyanka Chopra