స్పిరిట్ పై కీలక అప్డేట్ ఇచ్చిన సందీప్
Sandeep Reddy's Update on Spirit
కల్ట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ స్పిరిట్ చిత్ర షూటింగ్ కి ప్రస్తుతం చిన్న బ్రేక్ ఇచ్చారు. ఓ వారం ప్రభాస్ వెకేషన్ కి వెళ్ళొచ్చాక హను రాఘవపూడి ఫౌజీ సెట్ లో జాయిన్ అవుతారు. ఈ ఏడాది మార్చి నుంచి జులై 15 వరకు ప్రభాస్ స్పిరిట్ చిత్రంతో పాటుగా ప్రభాస్ ఫౌజీ షూటింగ్ చేస్తూ వచ్చారు.
అయితే ఈమద్యలో స్పిరిట్ కి సంబందించిన షూటింగ్ విషయాలేవీ బయటకు రాలేదు. ఫస్ట్ హాఫ్ లో ఓ పవర్ ఫుల్ ట్విస్ట్ ఇంటర్వెల్ లో రివీల్ అవుతుంది అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయిన తరుణంలో సందీప్ రెడ్డి వంగ ఓ ఈవెంట్ లో స్పిరిట్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఫ్యాన్స్ కి అందించారు.
ఇప్పటికే స్పిరిట్ షూటింగ్ 40 శాతం పూర్తయిందని, ఈ సినిమా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను అంటూ సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ పై ఇచ్చిన అప్ డేట్ కి ప్రభాస్ ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి లో విడుదలవుతుందా అనే సందేహాలకు సందీప్ ఈ సందర్భంగా చెక్ పెట్టారు.







































