సీఎం సినిమానా మజాకానా..

Jana Nayagan ticket booking openJana Nayagan ticket booking open


విజయ్ లాస్ట్ చిత్రానికి ఎంతగా క్రేజ్ ఉందొ అనేది టికెట్ బుకింగ్స్ చూస్తుంటే తెలుస్తుంది. విజయ్ చివరి చిత్రంగా జన నాయగన్ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. విజయ్ ఇకపై సినిమాల్లో నటించను, నా లాస్ట్ చిత్రం జన నాయగన్ అని ప్రకటించినప్పటినుంచి సినిమాపై అంచనాలు ఉన్నాయి.

అందులో విజయ్ సీఎం అయ్యాక విడుదల కాబోతున్న జన నాయగన్ పై ఆ అంచనాలు, హైప్ మరింతగా పెరిగింది. అందుకే జన నాయగన్ చూసేందుకు అభిమానులే కాదు తమిళ ప్రేక్షకులంతా వెయిట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది వ్యవహారం. జన నాయగన్ టికెట్ బుకింగ్స్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి.

విజయ్, పూజ హెగ్డే, మమిత బైజు కలయికలో తెరకెక్కిన జన నాయగన్ చిత్రం ఈనెల 23 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా జన నాయగన్ బుకింగ్స్ ఓపెన్ చెయ్యగానే టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి. అది చూసే సీఎం సినిమానా మజాకానా అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.

Jana Nayagan advance booking opens