ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bhagyashri Borse hikes her Remuneration

ఒకే ఒక్క హిట్ ఫేట్ మార్చేసింది

Bhagyashri Borse hikes her Remuneration

 

హ్యాట్రిక్ ఫెయిల్యూర్స్ తర్వాత ఒక్క హిట్ పడితే అది కెరీర్ లో బిగ్ రిలీఫ్ ఇవ్వడమే కాదు.. దాని వెంట బోలెడన్ని అవకాశాలు, పారితోషికాలు పెరగడాలు ఇలా చాలా వచ్చేస్తాయి. అదే ఇప్పుడు లెనిన్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ఆస్వాదిస్తున్న రిలీఫ్. లెనిన్ కి ముందు మూడు సినిమాలు భాగ్యశ్రీ బోర్సే ను డిజప్పాయింట్ చేసాయి.

మిస్టర్ బచ్చన్, కింగ్ డమ్, ఆంధ్ర తాలూకా కింగ్ ఇలా మూడు డిజప్పాయింట్మెంట్స్ తర్వాత లెనిన్ తో అమ్మడు మంచి హిట్ అందుకుంది. అఖిల్ తో అనుకోకుండా వచ్చిన ఛాన్స్ భాగ్యశ్రీ బోర్సే ఫేట్ ని మార్చేసింది. ఒకే ఒక్క సినిమా భాగ్యశ్రీ ని హీరోయిన్ గా నిలబెట్టేసింది. అదే అదునుగా భాగ్యశ్రీ బోర్సే పారితోషికం పెంచేసింది అంటున్నారు.

భాగ్యశ్రీ బోర్సే తన దగ్గరకొస్తున్న కొత్త అవకాశాలకు రూ.2.5 కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేస్తుందట. లెనిన్ కి ముందు ఆమె రూ.1.5 కోట్లు అందుకుంది. ఈ హిట్టు తో రూ.2.5 కోట్లు అడుగుతుందట. ఇప్పటివరకు హిట్లు లేకపోయినా భాగ్యశ్రీ బోర్సే కి తెలుగులో, తమిళంలో రెండుమూడు ప్రాజెక్ట్స్ చేతిలో ఉన్నాయి.

ఇకపై ఆమె దగ్గరకొచ్చే నిర్మాతలు ఆమెకు రూ.2.5 కోట్లు ఇస్తేనే ఆమె సినిమా ఓకే చేస్తుంది. లేదంటే ఇంతటి గ్లామర్ గర్ల్ ను వదులుకోవాల్సిందే. చూసారా ఒక్క హిట్టు ఫేట్ మార్చడమంటే ఇదే మరి. 

Bhagyasri Borse Hikes Remuneration After Lenin Success