సమంత సినిమాలో శోభిత

Samantha Maa Inti Bangaram

 

ఈ టైటిల్ చూసి సమంత సినిమాలో శోభిత ఏమిటి అనుకుంటున్నారా.. నాగ చైతన్య ను ప్రేమించి పెళ్లాడిన సమంత నాలుగేళ్లకే విడాకులిచ్చి చైతు తో విడిపోయింది. ఆతర్వాత ఒంటరి ప్రయాణంలో మరో ప్రేమను వెతుక్కుని దర్శకుడు రాజ్ నిడిమోరును గత ఏడాది వివాహం చేసుకుంది.

నాగ చైతన్య కూడా శోభిత ను ప్రేమించి పెళ్లి చేసుకుని త్వరగానే లైఫ్ లో మూవ్ అయ్యాడు. అయితే ఈమధ్యన సమంత మా ఇంటి బంగారం ప్రమోషన్స్ లో నాగ చైతన్య విషయంలో ఇండైరెక్ట్ గా చేసిన కామెంట్స్ శోభిత ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ పై సోషల్ మీడియాలో హాట్ హాట్ గా చర్చ జరిగింది.

ఇక ఇప్పుడు సమంత సినిమాలో శోభిత ఏమిటి అనుకున్నారా.. సమంత రూ.100 కోట్ల మా ఇంటి బంగారం మూవీ చిత్రం జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ లోకి వచ్చింది. మా ఇంటి బంగారం చిత్రం వీక్షిస్తుంటే మధ్యలో లెక్కకు మించిన యాడ్స్. ఆ యాడ్స్ లో ఎక్కువగా శోభిత యాక్ట్ చేసిన భీమా జ్యువెలరీ యాడ్ ఉండడంతో.. ఓటీటీ ఆడియన్స్ అంతా సమంత సినిమాలో శోభిత అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. 

Sobhita Jewellery AD