లెనిన్ కి సెకండ్ ఛాన్స్ ఉందా?

Lenin movie


ఈ వారం చాలా సినిమాలు విడుదలయ్యాయి. కానీ ఈ వారం విడుదలైన సినిమాలన్నీ ప్రేక్షకులని ఇంప్రెస్స్ చెయ్యలేక చేతులెత్తేశాయి. తిరువీర్-ఐశ్వర్య రాజేష్ ల ఓ సుకుమార్, జగపతిబాబు వదలా, మిస్టర్ మిడిల్ క్లాస్, రాజా ది రాజా, వెంకటరామయ్యగారి మనవరాలు, MRP నీకెంత - నాకెంత లాంటి చిన్న సినిమాలేవీ ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయాయి.

గత వారం విడుదలైన లెనిన్ కి ప్రేక్షకులు రెండో ఛాన్స్ ఇస్తారా, రెండో వారం లెనిన్ థియేటర్స్ వైపు ఆడియన్స్ చూస్తారా.. చూస్తే లెనిన్ కి 100 కోట్ల క్లబ్బులోకి వెళ్లే అవకాశం దక్కుతుంది. గత శుక్రవారం విడుదలైన లెనిన్ చిత్రానికి బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు. హిట్ టాక్ వచ్చినా అది మొదటి మూడు రోజుల వరకే కనిపించింది.

ఆతర్వాత లెనిన్ ప్రభావం అంతగా కనిపించలేదు. సో ఈ వారం సినిమాలన్నీ షెడ్డుకెళ్ళిపోయాయి. మరి లెనిన్ కి మరో ఛాన్స్ ఇచ్చి ప్రేక్షకులు వీకెండ్ వినోదం కోసం థియేటర్స్ కి వెళితే నిర్మాతలకు లాభాలే లాభాలు. చూద్దాం లెనిన్ అదృష్టం ఎలా ఉందొ అనేది. 

Lenin Boxoffice Collections