లేడీ ఓరియేంటెడ్ చిత్రాల్లో బ్రాండ్ భామామ‌ణులు!

Lady Oriented films

లేడీ ఓరియేంటెడ్ చిత్రాల‌తో స‌త్తా చాటీమ‌ణులు ఎవ‌రంటే?  స్వీటీ అనుష్క‌,  శ్రద్ధా కపూర్, సమంత లాంటి భామ‌లే టాప్ లో ఉన్నారు. అనుష్క కొన్నేళ్ల క్రిత‌మే `అరుంధ‌తి`తో బాక్సాఫీస్ వ‌ద్ద 70 కోట్ల‌కు పై గా సోలోగానూ రాబ‌ట్టింది. తాజాగా అంత‌కు మించిన భారీ విజ‌యాన్ని స‌మంత  `మా ఇంటి బంగారం`తో న‌మోదు చేసింది. ఈ సినిమా ఏకంగా 100  కోట్ల వ‌సూళ్లు సాధించింది  సౌత్ లో స‌రికొత్త రికార్డు సృష్టించింది.

లేడీ ఓరి యేంటెడ్ చిత్రాల్లో తొలిసారి సెంచ‌రీ  కొట్టిన న‌టి స‌మంత కావ‌డం విశేషం. బాలీవుడ్ లో శ్ర‌ద్దా క‌పూర్,  దీపికా ప‌దుకొణే,  విద్యాబాల‌న్  వంటి భామ‌లు సైతం వంద‌ల కోట్ల వ‌సూళ్లు సాధించారు. ప్ర‌త్యేకించి శ్ర‌ద్దాక‌పూర్ `స్త్రీ 2` తో ఏకంగా 800 కోట్ల‌వ సూళ్ల‌తో ఇండియాలోనే స‌రికొత్త రికార్డు సృష్టించింది. అలాగే నయనతార, జ్యోతిక , త్రిష వంటి సీనియర్ కథానాయికలు కూడా ఇలాంటి  సాహసాలు చేసి కొంతమేర విజయం సాధించినా?  భారీ స్థాయి కమర్షియల్ సక్సెస్ అందుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అలాగ‌ని ఆ భామ‌లు ప్ర‌య‌త్నాలు మాత్రం ఆప‌లేదు.

ప్రస్తుత తరుణంలో ఈ రేసులో రష్మిక మందన్న నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమెకు ఉన్న పాన్-ఇండియా ఇమేజ్ .. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోగల సామర్థ్యం, లేడీ ఓరియెంటెడ్ సినిమాలను భారీ స్థాయిలో నిలబెట్టడానికి దొహ‌ద‌ప‌డొచ్చు. యంగ్ ఏజ్ ఆడియన్స్ నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ వరకు ఆమెకు ఉన్న ఫ్యాన్ బేస్ ఇలాంటి  ప్రయోగాలకు అదనపు బలాన్ని చేకూరుస్తుందని చెప్పొచ్చు. కేవలం అందం మాత్రమే కాకుండా నటనలో చూపిస్తున్న వైవిధ్యం రష్మికను ఇతరుల కంటే భిన్నంగా నిలబెడుతోంది.

ఏదేమైనా?  లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు సక్సెస్ కావాలంటే హీరోయిన్ ఇమేజ్ మాత్రమే సరిపోదు. బలమైన కథాంశం .. దర్శకుడి మేకింగ్ స్టైల్ కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలో రష్మిక తీసుకునే నిర్ణయాలు, ఎంచుకునే స్క్రిప్టులు ఆమెను ఈ రేసులో ఎంత వరకు నిలబెడతాయో చూడాలి. 

Female-centric films