కోర్టు కూడా సీఎం విజయ్ కే సపోర్ట్
Vijay On Karur Stampede, Hands Over Jobs To Families
సీఎం విజయ్ కరూర్ తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామంటూ మాటివ్వడం దానిని చెన్నై హై కోర్టు సమర్ధించడం హాట్ టాపిక్ అయ్యింది. విజయ్ టీవీకే పార్టీ తో ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టిన సందర్భంలో గత ఏడాది సెప్టెంబర్లో కరూర్ సభలో తొక్కిసలాట జరిగి విజయ్ అభిమానులు చాలామంది ప్రాణాలు కోల్పోయారు.
ఆతర్వాత విజయ్ వారిని వారి కుటుంబాలను పరామర్శించలేకపోతున్నాను అని, తీవ్ర ఒత్తిడిలో, విపరీతమైన బాధలో ఉన్నట్లుగా విజయ్ బహిరంగ లేఖ రాసారు. ఈరోజు సీఎం హోదాలో విజయ్ కరూర్ తక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను మొదటిసారి పరామర్శించారు.
ఈ ప్రమాదంలో కుటుంబసభ్యులను కోల్పోయిన 32 బాధిత కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. అయితే విజయ్ కరూర్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సబ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రకటించగానే, ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను చెన్నై హైకోర్టు మదురై బెంచ్ శుక్రవారం విచారణ చేపట్టింది.
ప్రభుత్వ నిర్ణయంపై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించడమే కాదు, బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే తప్పేమిటి, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో కోర్టు తల దూర్చదని స్పష్టం చేసారు. దానితో విజయ్ బాధిత కుటుంబాలకు ఆ ప్రభుత్వ నియామక పత్రాలు అందజేశారు.







































