మెగాస్టార్ వ‌ర్సెస్ సూప‌ర్ స్టార్!

Megastar vs Super Star

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి - సూపర్ స్టార్ రజనీకాంత్ గొప్ప  నటులుగానే కాదు. ఒక శకానికి చిహ్నాలుగా నిలుస్తున్నారు. ఏడు పదుల వయస్సు  దాటినా? ఇద్ద‌రి లో ఉత్సాహం చూస్తుంటే యువ హీరోలు సైతం ఆశ్చర్యపోక తప్పదు. వయస్సు అంకె మాత్రమేనని నిరూపిస్తూ పాత్రల కోసం వారు తీసుకుంటోన్న‌ శ్రద్ధ, కష్టపడుతున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకం. గ్లామర్ కంటే తమదైన శైలిలో నటనతో ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా పెట్టుకోవడం  ఇద్ద‌రిలో ఉమ్మడి లక్షణం.

ప్రస్తుతం చిరంజీవి 158వ చిత్రంలో భాగంగా బాబీ కొల్లి దర్శకత్వంలో ఎంతో కఠినమైన యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తున్నారు. ఈ వయసులో కూడా డూప్‌ల సాయం లేకుండా ప్రమాదకరమైన ఫైట్ సీక్వెన్స్‌లలో పాల్గొనడం ఆయనకున్న అంకితభావానికి నిదర్శనం. మరోవైపు సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా తదుపరి చిత్రాల కోసం అదే స్థాయి పట్టుదలను ప్రదర్శిస్తున్నారు. `జైల‌ర్ 2` షూటింగ్ ద‌శ‌లో ర‌జ‌నీ ఎంత క‌ష్ట‌ప‌డ్డారో తెలిసిందే. ఇలా  పాత్రల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడానికి నిరంతరం శ్రమిస్తున్నారు.

ఇద్ద‌రి  ప్రయాణంలో గమనించదగ్గ విషయం ఏమిటంటే?  వారెప్పుడు ఒకే చోట ఆగిపోలేదు. కాలంతో పాటు మారుతోన్న ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా మ‌లుచుకుంటున్నారు. బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నారు. చిరంజీవి మాస్ ఇమేజ్‌ను కాపాడుకుంటూనే కొత్తదనం కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. రజనీకాంత్ తనదైన మేనరిజమ్స్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నారు.  ఇద్ద‌రి మధ్య ఉన్న ఈ ఆరోగ్యకరమైన పోటీయే ఇండస్ట్రీని మరింత ముందుకు తీసుకెళ్తోందన్న‌ది కాద‌న‌లేని నిజం.

Chiranjeevi vs Rajinikanth