ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> The conflict is with Chaitu, not Akhil

గొడవ చైతుతోనే అఖిల్ తో కాదు

The conflict is with Chaitu, not Akhil


సమంత కు గొడవ మాజీ భర్త అక్కినేని నాగ చైతన్య తోనే కానీ ఆ ఇంట్లో మరెవరితో ముఖ్యంగా అఖిల్ తో అస్సలు కాదు. నాగ చైతన్య ను ప్రేమించి వివాహం చేసుకుని విభేదాలు రావడంతో విడిపోయి మరో పెళ్లి చేసుకున్న సమంత అఖిల్ విషయంలో ఎప్పుడు పాజిటివ్ గానే ఉంటుంది. అఖిల్ కూడా సమంత విషయంలోనే అలానే ఉంటాడు.

రీసెంట్ గా సమంత నటించిన మా ఇంటి బంగారం బాగా ఆడాలని కోరుకున్న అఖిల్ కి ఇప్పుడు మాజీ వదిన సమంత బెస్ట్ విషెస్ చెబుతూ సపోర్ట్ చేసింది. అఖిల్ హీరోగా నటించిన లెనిన్ ఈరోజు థియేటర్లలోకి రావడంతో సమంత ఇన్స్టా స్టోరీలో లెనిన్ టీమ్ కు బెస్ట్ విషెస్ చెబుతూ లెనిన్ ట్రైలర్ ను షేర్ చేస్తూ.. హీరో అఖిల్ కు, చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్, అప్పుడే బ్లాక్‌బస్టర్ వైబ్స్ కనిపిస్తున్నాయంటూ లెనిన్ పై ఓ నోట్ రాసిపెట్టింది

మరి అఖిల్ సమంత  సినిమాని, సమంత అఖిల్ సినిమాని సపోర్ట్ చేస్తూ మట్లాడడం చూసినవాళ్లు సమంత కు నాగ చైతన్య తోనే గొడవ, అఖిల్ ఇంకా అక్కినేని ఫ్యామిలీ తో కాదు అంటూ సరదాగా కామెంట్లు పెడుతుంటే.. అక్కినేని ఫ్యాన్స్ మాత్రం అయోమయంలో పడిపోయారు.
 

Blockbuster Vibes Samantha Wishes Ex Brother-in-Law Akhil Akkineni As Lenin