Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> The interesting journey of that sensational duo!

ఆ క్రేజీ జోడీ ఇంట్రెస్టింగ్ జ‌ర్నీ!

The interesting journey of that sensational duo!

అగ్రనటుల మధ్య ఉండే స్నేహబంధాలు కొన్నిసార్లు ఆశ్చర్యకరమైన జ్ఞాపకాలను గుర్తు చేస్తుంటాయి. ఇటీవల `పతి పత్నీ ఔర్ వో దో` చిత్రంలో కలిసి నటించిన వామికా గబ్బి, ఆయుష్మాన్ ఖురానాల మధ్య ఉన్న ఓ పాత అనుబంధం వెలుగులోకి వచ్చింది. తన కళా ప్రస్థానం ప్రారంభ రోజుల్లో, ఆయుష్మాన్ ఖురానాకు చెందిన థియేటర్ గ్రూపులో నటించేందుకు వామికా ఆడిషన్ ఇచ్చి విఫలమైనట్లు ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తనను తిరస్కరించిన ఆ థియేటర్ గ్రూపుపై తనదైన శైలిలో నవ్వుతూ ఫిర్యాదు చేయడం  సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ఆసక్తికరమైన సంభాషణలో ఆయుష్మాన్  ఆ నిర్ణయం తీసుకున్నది తన జూనియర్లు అయి ఉండొచ్చ‌ని అప్పుడు తాను అక్కడ లేనని వివరణ ఇచ్చారు. ఆయుష్మాన్ చండీగఢ్‌లో ఉన్న రోజుల్లో నాటకరంగం - సంగీతంలో ఎంతలా నిమగ్నమై ఉండేవారో? తెలియజేయగా వామికా వెంటనే ఆనాటి తిరస్కరణను ప్రస్తావిస్తూ కౌంటర్ ఇచ్చారు. ఒకప్పుడు తిరస్కరించిన అదే థియేటర్ గ్రూపు సభ్యులనుద్దేశించి వామికా చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకులను అలరించాయి.

ఈ చ‌ర్చ‌  ఇద్ద‌రి మధ్య  ఆరోగ్యకరమైన స్నేహాన్ని చాటి చెబుతుంది.  ఒకప్పుడు చిన్న ఆడిషన్ తిరస్కరించిన వారే నేడు కలిసి ప్రధాన పాత్రల్లో నటించే స్థాయికి ఎదగడం, సినీ రంగంలో పట్టుదల- కృషికి నిదర్శనంగా నిలుస్తోంది.
ప్రస్తుతం  ఇద్ద‌రు కెరీర్‌లో విభిన్న ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయుష్మాన్ ఖురానా `ఉడ్తా తీర్` షూటింగ్ లో బిజీగా ఉన్నారు. వామికా గబ్బి తమిళం, పంజాబీ , హిందీ భాషల్లో పలు క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు.

Ayushmann Khurrana's theatre group once rejected Wamiqa Gabbi