Advertisement

సెంచరీకి దగ్గరైన బంగారం

Maa Inti Bangaram 2 Weeks collections


రెండు వారాల క్రితం మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చిన సమంత మా ఇంటి బంగారం సెంచరీకి దగ్గరైంది. మా ఇంటి బంగారం విడుదలయ్యాక పోటీ ఇచ్చే సినిమాలు లేకపోవడం బంగారానికి బాగా కలిసొచ్చింది. ఇక మూడోవారంలో మా ఇంటి బంగారం కలెక్షన్స్ కి బ్రేకులు పడతాయని అనుకున్నారు.

ఈ వారం నాగబంధం, సత్యదేవ్ రావు బహదూర్ చిత్రాలు విడుదలకు ముందు ఇంట్రెస్టింగ్ గా అనిపించడంతో ఈ శుక్రవారం మా ఇంటి బంగారం ఆక్యుపెన్సీ తగ్గింది. కానీ మరో వీకెండ్ మా ఇంటి బంగారానికి హెల్ప్ అవ్వనుంది. ఈరోజు విడుదలైన నాగబంధం, సత్యదేవ్ రావు బహదూర్ చిత్రాలు రెండూ యావరేజ్ టాక్ కూడా సొంతం చేసుకోలేకపోయాయి.

అందుకే మా ఇంటి బంగారం కి మరో వీకెండ్ కలిసొస్తుంది అనేది. ఇక రెండు వారాలకు గాను మా ఇంటి బంగారం రూ.92 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లుగా మేకర్స్ పోస్టర్ వేసి ప్రకటించారు. మరి ఈ వారం కూడా బంగారానికి కలిసొస్తే రూ.100 కోట్లు కొట్టడం పెద్ద మ్యాటర్   కాదు.అందుకే అనేది సెంచరీకి దగ్గరైన బంగారం అని.!

Maa Inti Bangaram 2 Weeks World Wide Collections