Advertisement

దేవ‌ర‌కొండ క్ర‌ష్ ఎవ‌రో ఓపెనైపోయాడు!

Anand Deverakonda Reveals His Crush

యువ నటుడు ఆనంద్ దేవరకొండ తనదైన శైలి చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ  ప్రత్యేక గుర్తింపును ద‌క్కించుకున్నాడు. కెరీర్ పరంగా విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ ప్రయోగాలు చేస్తున్న హీరో తాజాగా ఓ ఇంటర్వ్యూలోత‌న  వ్యక్తిగత అభిరుచుల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ముఖ్యంగా సినీ పరిశ్రమలో అందరినీ ఆకర్షించే క్రష్ అంశంపై ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.

తన మనసు దోచుకున్న నటీమణులు ఎవరనే? ప్రశ్నకు ఆనంద్ దేవరకొండ ఎంతో నిజాయితీగా స్పందించాడు. బాలీవుడ్ అగ్రతార దీపికా పదుకొణె అంటే  మొదటి నుండి ప్రత్యేకమైన ఇష్టమని ఆమె నటన  వ్యక్తిత్వం తనను ఎంతగానో ప్రభావితం చేసాయ‌న్నాడు. అలాగే తనతో కలిసి నటించిన వైష్ణవి చైతన్య గురించి స్పందించాడు. ఆమె ప్రతిభ తనను ఆకట్టుకుందని ఒక సహనటిగా ఆమెపై  ప్రత్యేకమైన అభిమానం ఉందని  మనసులో మాటను బయటపెట్టాడు.

వ్యక్తిగత జీవితంపై సెలబ్రిటీల స్పందనలు ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటాయి. ఆనంద్ దేవరకొండ ఇలా తన క్రష్ ఎవరో బాహాటంగా?  చెప్పడంతో  అభిమానులకు త‌న‌ వ్యక్తిగత ఇష్టాలను మరింత చేరువ చేసిన‌ట్లు అయింది. కమర్షియల్ హంగులతో కాకుండా  సహజంగా ఆయన ఇచ్చిన  సమాధానం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఏదేమైనా? ఇండస్ట్రీలో తనకంటూ ఓ మార్కును వేసుకుంటున్న ఆనంద్ ఇలాంటి విషయాల్లో కూడా పారదర్శకంగా ఉండటం నిజాయితీకి నిదర్శనంగా చెప్పొచ్చు.

Anand Deverakonda reveals he has a crush on that actress