స్పిరిట్ చాలా స్పెషల్: త్రిప్తి దిమ్రి
Triptii said she is very excited about Spirit
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్ట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న స్పిరిట్ మూవీ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే జెట్ స్పీడులో సాగుతుంది. వచ్చే ఏడాది మార్చి టార్గెట్ గా స్పిరిట్ షూటింగ్ ని సందీప్ వంగ చిత్రీకరిస్తున్నారు. ఇక స్పిరిట్ పై ఏ చిన్న విషయం బయటికి వచ్చినా అది ఇట్టే సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.
తాజాగా ఈ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ భామ త్రిప్తి దిమ్రి స్పిరిట్ పై చేసిన కామెంట్స్ ని ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. స్పిరిట్ ప్రాజెక్ట్ చాలా స్పెషల్ గా ఉండబోతుంది. మిగతా విషయాలు చెప్పలేనప్పటికీ ఆడియన్స్ మాత్రం స్పిరిట్ చిత్రాన్ని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అంటూ త్రిప్తి డుమ్రి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
రీసెంట్ గానే హైదరాబాద్ చంచల్ గూడా జైలులో స్పిరిట్ షూటింగ్ జరిగింది. ప్రభాస్ ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ స్పిరిట్ లో ప్రభాస్ కి విలన్ గా కనిపించబోతున్నారు.








































