టాక్సిక్ నుంచి మరో టీజర్
Yash Confirms July 1 Teaser
యశ్ టాక్సిక్ పదే పదే వాయిదాలు పడి చివరికి ఆగష్టు 26 న పాన్ ఇండియా థియేటర్స్ లో విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ ఇంతకుముందే ప్రకటించారు. టాక్సిక్ నుంచి వచ్చిన టీజర్ పై సోషల్ మీడియాలో పలు విమర్శలొచ్చాయి. టాక్సిక్ టీజర్ ఏ విధంగానూ ప్రేక్షకులకు కనెక్ట్ అవలేదు.
అందుకే యాక్సిక్ రిలీజ్ కూడా వాయిదా వేసి రీ షూట్స్ చేసి ఆగష్టు 26 కి విడుదల చేసేందుకు సిద్ధం చేస్తున్నారు మేకర్స్. యశ్ కూడా ఇకపై దర్శకురాలు గీతూ తో కలిసి ప్రమోషన్స్ లో బిజీ అవ్వనున్నారు. అయితే టాక్సిక్ పై క్రేజ్ పెంచేందుకు మేకర్స్ రేపు జులై 1న మరో టీజర్ వదలనున్నట్లుగా తెలుస్తుంది. ఈ టీజర్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా కట్ చేశారట.
గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో తెరకెక్కిన టాక్సిక్ మూవీలో ఎనిమిదిమంది హీరోయిన్స్ కనిపించబోతున్నారు. అందులో కియారా అద్వానీ, నయనతార, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషి ఇలా పలువురు భామలు టాక్సిక్ కి ప్రధాన కర్షణగా నిలవనున్నారు.







































