ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> An Interesting Episode to be added in Vishwambara

విశ్వంభరకు రిపేర్లు

An Interesting Episode to be added in Vishwambara

 

మెగాస్టార్ చిరంజీవి-వసిష్ఠ కలయికలో భారీ విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న విశ్వంభర చిత్ర విడుదల అనేది మరీ కామెడీ అయ్యిపోయింది. మెగా ఫ్యాన్స్ కూడా విశ్వంభర పై హోప్స్ వదులుకుంటున్నారు. ఎలాంటి అప్ డేట్ లేకుండా, రిలీజ్ డేట్ ఇవ్వకుండా సినిమాపై ఉన్న అంచనాలు తగ్గేలా చేస్తున్నారు.

సీజీ వర్క్ అంటూ కాలయాపన చేస్తున్న వసిష్ఠ ఇప్పుడు విశ్వంభర కు కొన్ని అదనపు ఎపిసోడ్స్ యాడ్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. కథకు మాత్రమే కాదు, క్లైమాక్స్ కి కూడా మరింత బలం చేకూర్చేందుకు ఓ ఎపిసోడ్ ప్లాన్ చేశారట. ఈ షూటింగ్ కోసం చిరు ఓ నాలుగైదు రోజుల పాటు డేట్స్ కేటాయించాల్సి వస్తుంది అంటున్నారు.

ప్రస్తుతం చిరు దర్శకుడు బాబీ తో కలిసి మెగా 158 షూటింగ్ లో చాలా బిజీగా వున్నారు. ఆ షెడ్యూల్ బ్రేక్ లో చిరు విశ్వంభ‌ర‌ కు డేట్లు కేటాయించి, ఈ సినిమాని ఫినిష్ చేసే ఆలోచ‌న‌లో ఉన్నారు అని తెలుస్తుంది. ఆ ఐదు రోజుల షూటింగ్ ఫినిష్ కాగానే సినిమా రిలీజ్ డేట్ పై మేకర్స్ ఓ నిర్ణయానికి వస్తారని, దసరా స్పెషల్ గా విశ్వంభర వచ్చే ఛాన్స్ ఉంది అని తెలుస్తుంది. 

Vishwambhara is getting an exciting new episode to boost its climax!