ఫౌజీ రిలీజ్ డేట్ వస్తోంది

Is this Fauzi release dateIs this Fauzi release date


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-హను రాఘవపూడి కాంబోలో క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఫౌజీ చిత్ర రిలీజ్ డేట్ పై ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా సస్పెన్స్ నడుస్తుంది. ఆగస్టు అన్నారు, కాదు ఫౌజీ దసరా రిలీజ్ అంటూ మేకర్స్ చెప్పారు. కానీ షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడం, పోస్ట్ ప్రొడక్షన్ తో ఫౌజీ రిలీజ్ ఆలస్యమవుతుంది అని తెలుస్తుంది.

తాజాగా మేకర్స్ డిసెంబర్ 3 ని ఫౌజీ విడుదలకు ఫిక్స్ చేసారని, త్వరలోనే ఆ విడుదల తేదీని ప్రకటిస్తారని సమాచారం అందుతుంది. అసలే రాజసాబ్ డిజాస్టర్ మోడ్ లో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఫౌజీ విడుదల కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. ఫౌజీ తో ప్రభాస్ బౌన్స్ బ్యాక్ అవ్వాలని వారి కోరిక.

కానీ అది ఆలస్యమవడం, పదే పదే రిలీజ్ విషయంలో న్యూస్ లు రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ లో ఆందోళన కనిపించింది. ఇప్పుడు ఫైనల్ గా ఫౌజీ డిసెంబర్ 3 ని ఖరారు చేసుకుంది అంటున్నారు. డిసెంబర్ 3 న ఫౌజీ పాన్ ఇండియా థియేటర్స్ లో విడుదలవుతుంది. మరి ఆ డేట్ ఎప్పుడు అఫీషియల్ గా చెబుతారో మేకర్స్ చూడాలి. 

Is this Fauzi release date