గేమ్ చెంజర్ ఆడకపోవడానికి కారణం అదే
Dil Raju Breaks Silence on Game Changer
దర్శకుడు శంకర్, హీరో రామ్ చరణ్ ని గేమ్ చేంజర్ తో ముంచేశారు. ఎన్నో అంచనాలు, ఎంతో హోప్స్ పెట్టుకున్న గేమ్ చేంజర్ రామ్ చరణ్ కెరీర్ లో మాయని మచ్చగా మిగిలిపోయింది. ఇండియన్ 2 నుంచి తప్పించుకున్న దిల్ రాజు గేమ్ చేంజర్ తో శంకర్ కి అడ్డంగా దొరికిపోయారు. ఆ చిత్రం తర్వాత దిల్ రాజు లో ఎంతో మార్పు వచ్చింది.
అయితే గేమ్ చేంజర్ డిజాస్టర్ పై దిల్ రాజు ఎప్పుడు ఎక్కడా ఓపెన్ అవ్వలేదు. కానీ తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూ లో రామ్ చరణ్ తో తాను తీసిన గేమ్ చేంజర్ ఆడకపోవడానికి కారణాలు చెప్పారు. ఆ చిత్రం ఎక్కువరోజులు ప్రొడక్షన్ లో ఉండడం, ప్రొడక్షన్ ఆలస్యం వల్ల బడ్జెట్ పెరిగిపోయింది.
అంతేకాకుండా అది అవుట్ డేటెడ్ సబ్జెట్ అంటూ దిల్ రాజు ఇండైరెక్ట్ కామెంట్స్ చేసారు. ఎన్నికలు ముందు అలాంటి కాన్సెప్ట్ ఆడియన్స్ కి ఎక్కుతుంది. ఎన్నికల తర్వాత రిలీజ్ అయితే ఎవరు చూస్తారు. గేమ్ చేంజర్ తో తను చాలా నష్టపోయానని, కాని అదే సమయంలో తనని సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఆదుకుంది అని దిల్ రాజు గేమ్ చేంజర్ విషయంలో అంతా ఓపెన్ అయ్యారు.







































