భర్త తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న కీర్తి సురేష్
Keerthy Suresh Visit To Tirumala Templeమహానటి కీర్తి సురేష్ పెళ్లి తర్వాత కెరీర్ లో బాగా డల్ అయ్యింది. చిన్ననాటి స్నేహితుడు ఆంటోని ని హిందూ, క్రిష్టియన్ సాంప్రదాయంలో గోవా లో వివాహం చేసుకుంది. ఆతర్వాత కీర్తి సురేష్ కి అవకాశాలు తగ్గాయి. తాజాగా తెలుగులో అనిల్ రావిపూడి-వెంకటేష్-కళ్యాణ్ రామ్ మూవీలో వెంకీ సరసన హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది.
అయితే తాజాగా కీర్తి సురేష్ భర్త ఆంటోని తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కీర్తి సురేష్, ఆంటోని సాంప్రదాయ దుస్తుల్లో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం పండితులు కీర్తి సురేష్ కి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
భర్త ఆంటోనీతో కలిసి కీర్తి సురేష్ మొదటిసారి తిరుమల వెళ్ళింది. శ్రీవారి దర్శనం తర్వాత కీర్తి సురేష్, ఆంటోని దంపతులు మాఢవీధుల్లో అభిమానులతో కలిసి ఫోటొలకు ఫోజులిచ్చారు.
Keerthy Suresh First Visit To Tirumala Temple With Her Husband







































