ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bumper chance for Jana Nayagan producer

జన నాయగన్ నిర్మాతకు బంపర్ ఛాన్స్

Bumper chance for Jana Nayagan producer


తమిళనాడు సీఎం విజయ్ చివరి సినిమా జన నాయగన్ విడుదలకు నోచుకోక నిర్మాతలు తీవ్ర ఇబ్బందుల్లో పడుతున్నారు. సెన్సార్ సర్టిఫికెట్ రాక జన నాయగన్ రిలీజ్ ఆగిపోయింది. ఇప్పుడు విజయ్ జన నాయగన్ నిర్మాతకు ఓ బంపర్ ఛాన్స్ ఇచ్చారు. అదేదో సినిమా అవకాశం కాదండీ.. జన నాయగన్ నిర్మాతకు సీఎం విజయ్ అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు.

కె.వెంకటనారాయణ ను ఢిల్లీలో తమిళనాడు ప్రభుత్వ ప్రతినిధిగా నియమిస్తూ తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయికుమార్ శుక్రవారం ఉత్త ర్వులు జారీ చేశారు. ఏడాది పాటు కె.వెంకటనారాయణకు ఈ పదవిలో కొనసాగుతారు. విజయ్ కు వెంకటనారాయణ మంచి ఫ్రెండ్.

అటు సినిమా నిర్మాత, ఇటు ఫ్రెండ్ కావడంతో వెంకటనారాయణను ఆ పదవి వరించింది. అయితే ఈ నియామకంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. 

Jana Nayagan producer in a crucial govt role