ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> All eyes on Maa Inti Bangaaram's long weekend collections

బంగారానికి లాంగ్ వీకెండ్ ప్లస్సు

All eyes on Maa Inti Bangaaram's long weekend collections

 

మా ఇంటి బంగారానికి ఈ వీకెండ్ కూడా ప్లస్ కానుంది. ఈ వీకెండ్ అంటే లాంగ్ వీకెండ్. ఈ ఫ్రైడే, శని, ఆదివారాలు మా ఇంటి బంగారం కి మరిన్ని కలెక్షన్స్ తెచ్చి పెట్టడం ఖాయం. ఎదుకంటే ఈవారం థియేట్రికల్ రిలీజ్ లు లేవు, కానీ రీ-రిలీజులు మాత్రమే ఉన్నాయి. అంటే బంగారానికి పోటీ ఇచ్చే సినిమా ఒక్కటి కూడా లేదు.

గత వారం విడుదలైన మా ఇంటి బంగారానికి మంచి హిట్ టాక్ రావడంతో కలెక్షన్స్ బావున్నాయి. అన్ని ఏరియాల్లో విడుదలైన మూడు నుంచి నాలుగు రోజులకే బ్రేక్ ఈవెన్ అవడంతో మిగతా లెక్కలన్నీ నిర్మాత సమంత పాకెట్ లోకి వెళుతున్నాయి. బంగారంతో సమంత మంచి లాభాలు చవి చూసింది.

ఇక ఇప్పుడు రెండో వారంలోను బంగారంతో పోటీపడే సినిమా లేకపోవడం, ఈ లాంగ్ వీకెండ్ అన్ని ప్లస్ గా కన్పిస్తున్నాయి. మరి మా ఇంటి బంగారం ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేస్తుందో చూద్దాం.

Will Bangaaram Shine in Its Long Second Weekend?